NTV Telugu Site icon

Ntv Topnews: టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.ఏపీలో మద్యం బ్రాండ్లపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కల్తీ సారా అరికట్టాలి.. రాష్ట్రంలో జె బ్రాండ్స్ మద్యం నిషేధించాలి అనే డిమాండ్‌తో రేపు ఎల్లుండి నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. మద్యం పై ప్రభుత్వాన్ని గ్రామ స్థాయి నేతలు, క్యాడర్ నిలదీయాలి. సీఎం జగన్ ధన దాహంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడు.

2.యాదాద్రి నరసింహ స్వామి దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త.. గతంలో నిర్ణయించిన ప్రకారమే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి బాలాలయంలో కాకుండా ప్రధాన ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి ఇస్తారు.. యాదాద్రి స్వామివారి స్వయంభువుల దర్శనాలు ఈ నెల 28న ఉదయం 11.55 గంటలకు నిర్వహించనున్న మహాకుంభ సంప్రోక్షణతో ప్రారంభం అవుతాయని తెలిపారు ఆలయ ఈవో గీతారెడ్డి.. ఈ నెల 21 నుంచి వారం రోజుల పాటు బాలాలయంలో పంచ కుండాత్మక యాగం నిర్వహిస్తామని…

3.స్మార్ట్ సిటీ పేరుతో కేంద్రం ఇచ్చిన నిధులతో కరీంనగర్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తోందని, టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా మళ్లీ కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని విమర్శలు చేస్తోందని మండిపడ్డారు కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. టీఆర్ఎస్ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్ లో నిన్న ప్రారంభోత్సవం చేసిన నిధులు ఎక్కడి నుండి వచ్చాయో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

4. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్బుతం అని అంతా కొనియాడారు. కోటి ఎకరాలకు సాగునీరు అత్యద్భుతం, ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉన్నా… ఆ ప్యాకేజీలో భాగంగా చేపడుతున్న రిజర్వాయర్ సామర్ధ్యం పెంపు ఆగ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. రిజర్వాయర్ కోసం భూములు ఇచ్చి నష్టపోయిన రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది. యువకులు ఉపాధి కూడా కోల్పోతున్నారు. రిజర్వాయర్ సామర్ధ్యం పెంపు నిర్ణయంతో పోరుబాటకు సిద్దం అవుతున్నారు రైతులు. ఆ రిజర్వాయర్ నిర్మాణంతో ఊళ్లో పెళ్ళి కాని ప్రసాదులు పెరిగిపోతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

5.ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ కష్టాలు పేదలను సతాయిస్తున్నాయి. రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ యంత్రాలు మొరాయిస్తుండటంతో రేషన్ బియ్యం రాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సర్వర్ డౌన్ సమస్యలతో ఇప్పటి వరకు 40 శాతం మందికి కూడా పంపిణీ జరగలేదు. మరోవైపు రేషన్ బియ్యం ఇచ్చే గడువు 15తో ముగియడంతో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. తమకు రేషన్ బియ్యం అందుతాయా లేదా అని వారు ఎదురుచూస్తున్నారు.

6.తెలంగాణ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి.. కరోనా కారణంగో గత రెండేళ్లుగా సామూహిక వేడకలకు దూరమైన ప్రజలు.. ఈ సారి హోలీ పండుగను మంచి జోష్‌లో సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. అయితే, హోలీ వేడుకల్లో అధికార టీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.. తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్న మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్…

7.రెండేళ్ల తరువాత మళ్లీ శ్రీరామ నవమి వేడుకలకు భద్రాద్రి ముస్తాబవుతుంది. భద్రాచలంలో మిథిలా స్టేడియంలో రాముల వారి కళ్యాణం జరుగనుంది. కరోనా వల్ల ఈ రెండేళ్ల పాటు భక్తులు లేకుండా కళ్యాణాన్ని నిర్వహించిన దేవస్తానం ఇప్పుడు మాత్రం భక్తుల సమక్షంలోనే కళ్యాణాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లను చేసింది. శ్రీరాముడిని హోలీ పండుగ రోజే పెళ్లి కుమారుడిని చేయడం ఆనవాయితీ.. అదే ఆనవాయితీని ఈరోజు స్వామి వారి పెళ్ళికొడుకుని చేసిన అనంతరం వసంతోత్సవం, డోలోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

8.రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధానికి రోజులు, వారాలు గడుస్తున్నాయి. వరుసగా 23వ రోజు ఉక్రెయిన్‌లో రష్యా ఎడతెగని విధ్వంసాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు చేస్తోంది. బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒకవైపు చర్చలు అంటూనే.. మరోవైపు మారణహోమం సృష్టిస్తోంది. జనావాసాలపైనా రాకెట్‌ బాంబులు ప్రయోగిస్తోంది. దీంతో ఉక్రెయిన్‌ ప్రధాన నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. గతంలో ఎంతో సుందరంగా, ఆహ్లాదంగా కనిపించిన ఉక్రెయిన్‌ నగరాలు.. ఇప్పుడు కకావికలంగా మారాయి.

9.The Kashmir Files చిత్రంతో వార్తల్లో నిలిచిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ప్రభుత్వం అత్యన్నత భద్రతను అందించడం హాట్ టాపిక్ గా మారింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన The Kashmir Files మూవీలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. మార్చి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో కాశ్మీరీ పండిట్‌లపై 1990లో జరిగిన అఘాయిత్యాలను చూపించారు. 

10.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దానికి కారణం ఆయన ట్వీటే. ఆ ట్వీట్ ఏమిటంటే… “అప్పుడు మనకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుస్తున్నాయి”… ఈ ట్వీట్ చూస్తే… ఇందులో అంతగా ఏముంది ? అసలు ఆయన దేనికి సంబంధించి ఈ ట్వీట్ చేశారు ? అనే డౌట్ రాక మానదు. బిగ్ బీ అమితాబ్ చేసిన ట్వీట్ వివేక్ అగ్నిహోత్రి తాజా చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్‌’ మూవీపై అంటున్నారు.