1.యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో నాలుగేళ్ల కోర్సు, 8 సెమిస్టర్ల విధానానికి యూజీసీ గురువారం నాడు ఆమోదం పలికింది. ఈ నాలుగేళ్లలో ఒక్కో సెమిస్టర్ కాల వ్యవధి 90 రోజులు ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్లలో మ్యాథ్స్, సోషల్, హ్యూమానిటీస్, వృత్తి విద్య వంటి సబ్జెక్టులు ఉంటాయని యూజీసీ తెలిపింది. మూడో సెమిస్టర్ ముగిసిన తర్వాత మేజర్, మైనర్ సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది.
2.ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. మీడియాతో లోకేష్ చిట్ చాట్ చేశారు. నాలుగు రోజులైనా జంగారెడ్డి గూడెం మరణాలపై నాలుగు రోజుల పాటు సాగదీస్తున్నారంటూ ప్రభుత్వం విమర్శలు అర్ధరహితం. ప్రజల ప్రాణాలకంటే మాకు ఏదీ ఎక్కువ కాదు. ప్రజా సమస్యలపై మేం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం. సీఎం జగన్ అబద్దాలకు అలవాటు పడ్డారు.
3.ఐపీఎల్-15 సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ పృథ్వీ షా యోయో టెస్టులో విఫలమయ్యాడు. ఫిట్‌నెస్ టెస్టులో విఫలం కావడంతో మెగా టోర్నీకి అతడు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. యోయో టెస్టులో ప్రతి ఆటగాడు కనీసం 16.5 స్కోరు సాధించాల్సి ఉంది. ఈ స్కోరు సాధించకపోతే ఐపీఎల్‌లోకి నిర్వాహకులు అనుమతించరు.
4.ఏపీలో జంగారెడ్డి గూడెం ఘటన అటు విపక్షాలు, అధికార పక్షం మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. జంగారెడ్డిగూడెం నాటుసారా ఘటనపై మానవహక్కుల కమిషనుకు ఫిర్యాదు చేశామన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలజనాథ్. 30 మంది మృతికి గల కారణాలు బయటకురావాలన్నారు. ఇప్పటి వరకు ఎక్సైజ్ మంత్రి జంగారెడ్డి గూడెం ఎందుకు సందర్శించలేదని ఆయన ప్రశ్నించారు.
5.కన్నడ నాట పవర్ స్టార్ గా జేజేలు అందుకున్న పునీత్ రాజ్ కుమార్ బర్త్ డే రోజున ఆయన నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ విడుదల కావడం అభిమానులకు కొండంత ఊరట ఇచ్చిందనే చెప్పాలి. పునీత్ ఇమేజ్ కి అనుగుణంగా మాస్ మసాలాలు దట్టించి మరీ దర్శకుడు చేతన్ కుమార్ ‘జేమ్స్’ను తెరకెక్కించారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు, హిందీలోనూ అనువాదమైంది. గురువారం జనం ముందు ‘జేమ్స్’గా నిలచిన పునీత్ రాజ్ కుమార్ కు అభిమానులు జై కొడుతున్నారు.
6.ఏపీలో జగన్ సర్కార్ తీరుపై బీజేపీ నేతలు అస్త్రాలు ఎక్కుపెడుతూనే వున్నారు. ఏపీలో దిశ, దశ లేని ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే.. ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన మాత్రమే. రెండు నెలల క్రితమే అమిత్ షా మాకు ఈ విషయం పై దిశానిర్దేశం చేశారు.
7.ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు శాంసంగ్, వన్‌ప్లస్ వినియోగదారులకు క్షమాపణలు చెప్పాయి. స్మార్ట్ ఫోన్‌లలో యాప్ థ్రాట్లింగ్ జరుగుతుండటంపై సదరు కంపెనీలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఫోన్‌లలో గేమింగ్ పర్ఫార్మెన్స్ పెంచడడం కోసం సదరు సంస్థలు ప్లే స్టోర్‌లలోనే వివిధ యాప్‌ల పనితీరు సామర్థ్యాన్ని తగ్గించి చూపెడుతున్నాయి. దీంతో బ్యాటరీ లైఫ్‌ను పెంచడంతో పాటు గేమ్‌లకు అనువుగా సాఫ్ట్‌వేర్‌ను మరింత శక్తివంతంగా మారుస్తున్నాయి.
8.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న కాంగ్రెస్ పార్టీని.. అంతర్గత విభేధాలు కూడా కలవరపెడుతూనే ఉన్నాయి.. కాంగ్రెస్‌లో సీనియర్లుగా ఉన్న నేతలు రెబల్స్‌గా జట్టు కట్టడం ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది.. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన ప్రారంభించింది.. ఇప్పటికే ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లో రాజీనామా చేయాలని ఆదేశించింది.. మరోవైపు.. అసమ్మతి నేతల డిమాండ్లపై కూడా ఫోకస్ పెడుతున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.
9.తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల ఒక్క ఐడియా.. ఇప్పుడు కోట్లు కుమ్మరిస్తోంది.. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చిన డిస్కౌంట్ ఆఫర్‌కు అనూహ్యంగా స్పందన వస్తోంది.. చలాన్లు కట్టేందుకు వాహనదారులు పోటీ పడడంతో.. కొన్నిసార్లు సర్వర్ మొరాయించిన సందర్భాలు కూడా ఉన్నాయంటే.. వాహనదారులు ఏ స్థాయిలో పెండింగ్ చలాన్లు క్లియర్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
10.ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరిలోనూ చర్చనీయాంశమైన చిత్రం ‘ద కశ్మీర్ ఫైల్స్’. చిన్నచిత్రంగా విడుదలై భారీ విజయం దిశగా ఈ సినిమా పయనిస్తోంది. ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన బాణీలో ట్వీట్ చేశారు. ఇకపై బాలీవుడ్ ను రెండు శకాలుగా విభజించాలని అన్నారు. ఒకటి ‘ద కశ్మీర్ ఫైల్స్’కు ముందు, రెండవది ‘ద కశ్మీర్ ఫైల్స్’ తరువాత అని ఆయన ట్వీట్ చేశారు. చలనచిత్రసీమలో ఇదో కొత్త బాణీ అని, దీనిని ప్రస్తుత, భవిష్యత్ దర్శకులు దృష్టిలో ఉంచుకోవాలనీ ఆయన సూచించారు.
