1.యూపీ ఎన్నికల్లో ఎన్నో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమయిన యూపీ ఎన్నికలు దేశానికి మార్గనిర్దేశనం చేస్తాయనడంతో అతిశయోక్తి లేదు. ప్రధానంగా బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. ఎన్నికల ముందు ఆయాపార్టీల నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు.
2.ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్‌పెట్టేందుకు కీలక ఆయుధంగా పనిచేస్తోంది వ్యాక్సినేషన్.. భారత్‌లో దేశీయంగా తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌కు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. ఇతర దేశాలకు కూడా సరఫరా చేసింది.. ఇక, ఇప్పుడు విస్తృతంగా వ్యాక్సినేషన్ జరగుతోంది.. ఈ సమయంలో ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. బహిరంగ మార్కెట్లో కోవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ).
3. శ్రీ సిటీలో నోవా ఎయిర్ ప్లాంట్‌ను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో మెడికల్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గోన్ వాయువుల తయారీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్ ఎండీ గజనన్‌నబర్, కమర్షియల్ హెడ్ శరద్ మధోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. రోజుకు220 టన్నుల ఆక్సిజన్ తయారీ ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్ ఉద్దేశమన్నారు. కేవలం 14 నెలల్లో ప్లాంట్ ప్రారంభం కావడం అన్నది ఓ మైలురాయి అని జగన్ అన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ప్లాంట్ ప్రారంభం కావడం ఒక విశేషమన్నారు.
4.ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై విముఖత తో ఉన్న ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఉద్యోగ సంఘాల నేతలు ఏకతాటిపై వచ్చి పీఆర్సీ సాధన కమిటీ గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించేందుకు ఏపీ ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
5.ఏపీలో ప్రస్తుతం 23 జిల్లాల అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 23 జిల్లాలపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు విముఖతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు వర్చువల్ గా భేటీ నిర్వహించారు. ఈ భేటీలో కొత్త జిల్లాల ప్రక్రియను సీనియర్ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జిల్లాల ప్రక్రియ కొనసాగుతుందని సీనియర్ నేతలు చంద్రబాబుకు వివరించారు.
6 వంద అన్న మాటకు ఉన్న విలువ ఏ పదానికి అంతగా కనిపించదు. సంస్కృతంలో శతం అన్నా, తెలుగులో నూరు అన్నా, అదే వందనే! సినిమా రంగంలో కూడా వందకున్న విలువ దేనికీ లేదనే చెప్పొచ్చు. ఒకప్పుడు వంద రోజులు ఆడిన సినిమా అంటే హిట్ మూవీగా లెక్కేసేవారు. ఆ తరువాత వంద కేంద్రాలలో శతదినోత్సవం అనగానే మరింత సూపర్ హిట్ అన్నారు. ఆ పై వంద కోట్లు పోగేసిన సినిమాను సూపర్ డూపర్ హిట్ అంటున్నారు.
7.కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కౌలు రైతులను ప్రభుత్వం రైతులుగా భావించడం లేదని ఆమె మండిపడ్డారు. కౌలు రైతు బతికి ఉన్నంత వరకు రైతు బీమా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు షర్మిల లేఖ రాశారు. రైతు బీమా విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై కేసులు పెట్టి న్యాయ పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు.
8.సాధారణంగా ఇల్లు ఇల్లులా కట్టుకుంటే నివశించడానికి అనువుగా ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా, కట్టుకుంటే, అందులో కూడా నివశించవచ్చు. కాకపోతే నివశించేందుకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో మామూలు ఇల్లు కట్టడమే చాలా కష్టం. అలాంటిది ఇంటిని తలకిందులుగా కట్టాలి అంటే చాలా కష్టం. అంతేకాదు, అందులోని వస్తువులు కూడా తలక్రిందులుగా ఉంటే… చెప్పాల్సింది ఏముంది సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఖాయమే.
9.కార్వీ ఎండీ పార్థసారథి, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ కృష్ణ హరిని నాలుగు రోజులు పాటు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చినట్లు ఈడీ తెలిపింది. ఖాతాదారుల సెక్యూరీటలను అక్రమంగా దారి మళ్లించినట్లు విచారణలో తేలిందని ఈడీ అధికారులు పేర్కొన్నారు.
10.లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడి స్వల్పంగా కోలుకున్నారు. కానీ ఇంకా ఆమె ఐసీయూలోనే ఉన్నారు. ఆమెకు వెంటిలేటర్ తొలగించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. వెంటిలేటర్ లేకుండా ఆమె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ ఉదయం కొంచెం సేపు వైద్యులు వెంటిలేటర్ తొలగించారు. దీంతో లతా మంగేష్కర్ కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం వైద్యులు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
