Site icon NTV Telugu

టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్ల విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సంక్రాంతి సీజన్ లో విడుదల కావాల్సిన పాన్ ఇండియా చిత్రాల విడుదల వాయిదా పడటంతో ప్రభుత్వం కూడా ఈ విషయమై నింపాదిగానే నిర్ణయం తీసుకొనేలా కనిపిస్తోంది. పలువురు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు దర్శక నిర్మాతలు ఆర్. నారాయణమూర్తి, రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి పేర్ని నానిని వ్యక్తిగతంగా కలిసి తమ వాదన వినిపించారు.

READ ALSO సినిమా టిక్కెట్ రేట్ల పరిశీలన కమిటీ ఫిబ్రవరి 2న మరోసారి సమావేశం!

2.ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ప్రస్తుతం హాట్‌ హాట్‌గా ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలు టీడీపీ ఎమ్మెల్యే బుద్ధావెంకన్న వర్సెస్‌ మంత్రి కొడాలినానిగా మారాయి. ఒకరిపై ఒకరూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఒక్కసారిగా చిన్నపాటి మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. మంగళవారం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నానిపై ఫైర్‌ అయ్యారు. మంత్రి కొడాలి నానిది దొంగతనాలు చేసే బతుకు.. కొడాలి నానికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని బుద్ధా అన్నారు.

READ ALSOగుడివాడ ఏమన్నా పాకిస్తానా..?: బుద్ధా వెంకన్న

3.టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. గతంలో ఏసీటీవోగా పని చేసిన సమయంలో అశోక్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. తన సర్వీసు రికార్డు లేకుండానే అశోక్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారనే అభియోగంపై కేసు నమోదు చేశామన్నారు.

READ ALSO నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై సీఐడీ కేసు

4.కేసీఆర్‌ తెలంగాణను అన్ని రకాలుగా మోసం చేశారని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నల్గొండలోని దేవర కొండలో ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీని ఉత్తమ్‌ కుమార్‌ తీవ్రంగా విమర్శించారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి 100 కోట్లు ఖర్చుపెట్టిన రియల్ వ్యాపారిని ఓడించి నన్ను గెలిపించారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి మనం వారసులమన్నారు. 

READ ALSO కేసీఆర్‌ తెలంగాణను అన్ని రకాలుగా మోసం చేశారు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

5.బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు హీరోయిన్ మాత్రమే కాలేదు కానీ అమ్మడికి హీరోయిన్ కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. అందాల ఆరబోత దగ్గర నుంచి బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ వరకు ఐరా అన్నింటిలోను ఓపెన్ మైండెడ్ గా ఉంటుంది. గతకొంత కాలంగా తండ్రి అమీర్ ఖాన్ పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ నుపూర్ షిఖరేతో ఐరా పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

READ ALSO అతనితో అమీర్ ఖాన్ కూతురు హాట్ రొమాన్స్ .. ఫొటోస్ వైరల్

6.సీఎస్ సమీర్ శర్మపై మరోసారి విరుచుకుపడ్డారు పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ. ఉద్యోగుల తరపున సీఎంతో సంప్రదింపులు జరపాల్సిన వ్యక్తి సీఎస్సే. పీఆర్సీ విషయంలో సీఎస్ తన బాధ్యతల్లో విఫలమయ్యారని గతంలోనూ చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా అన్నారు.

READ ALSO సీఎస్ సమీర్ శర్మపై స్టీరింగ్ కమిటీ ఫైర్

7.ఏపీ సీఎం జగన్‌కు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో… నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసే జిల్లాకు గ్రేటర్ పల్నాడు లేదా మహా పల్నాడు జిల్లాగా పేరు పెట్టాలని లేఖలో కోరారు. పార్లమెంట్ నియోజకవర్గాల తరహాలో జిల్లాల పునర్వ్యవస్థీకరణను వేగవంతం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

READ ALSO గ్రేటర్ పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలి.. సీఎం జగన్‌కు బీజేపీ ఎంపీ జీవీఎల్ లేఖ

8.సమాజంలో రోజురోజుకు కామాంధులు ఎక్కువైపోతున్నారు. ఎలాంటి వృత్తిలో ఉన్నాం.. ఎలాంటి పనులు చేస్తున్నామన్న విచక్షణ కూడా లేకుండా పోయింది. పోలీసులు, టీచర్లు, డాక్టర్లు ఇలాంటి గౌరవమైన వృత్తిలో ఉండికూడా కొంతమంది నీచమైన పనులకు పాల్పడుతున్నారు. చివరికి దేవుడు నమ్మి చర్చికి వచ్చిన భక్తులను కూడా ఫాదర్ లు వదిలిపెట్టకపోవడం శోచనీయం. తాజాగా ఒక సిస్టర్ ని పెళ్లి చేసుకొంటానని నమ్మించి ఒక ఫాదర్ మోసం చేసిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది.

READ ALSO సిస్టర్ తో ఫాదర్ రాసలీలలు.. 5 నెలలుగా రహస్యంగా అనుభవిస్తూ..

9.తమిళనాడుకు చెందిన ఆటోడ్రైవర్ అన్నాదురైను తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందించారు. చెనైకి చెందిన ఆటోడ్రైవర్ అన్నాదురై తన ఆటోను ప్రపంచ స్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దాడని… ఇది గొప్ప ఆలోచన అంటూ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. అన్నాదురై గత 10 ఏళ్ల నుంచి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా ప్రయాణికుల అవసరాలు తెలుసుకుని తన ఆటోలో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాడు.

READ ALSOతమిళనాడు ఆటోడ్రైవర్‌ను అభినందించిన మంత్రి కేటీఆర్

10.ప్రముఖ యూట్యూబ్ ఛానెల్.. మ్యాంగో వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్ సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఆధ్వర్యంలో మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్స్, సాంగ్స్ తో అలరించే మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ తాజాగా వివాదంలో చిక్కుకొంది. మ్యాంగో యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలలో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ గౌడ కుల సంఘాలు ధ్వజమెత్తాయి. నేడు మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ ఆఫీస్ పై వారు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

READ ALSO షాకింగ్: వివాదంలో సింగర్ సునీత భర్త..?

Exit mobile version