1.ఏపీలో జిల్లాల స్వరూపం మారిపోతోంది. మరికొద్ది గంటల్లో కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. కొత్త జిల్లాలకు సంబంధించిన వివరాలను ఎన్టీవీతో ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ పంచుకున్నారు. మంటేడ మండలాన్ని పార్వతీపురం నుంచి విజయనగరం జిల్లాలోకి మార్చాం. పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి మండలాన్ని విశాఖలో ఉంచాం అన్నారు.
2.ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు దాడి జరిపారు. అందులో పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారు అనే వార్తలు సంచలనంగా మారాయి. బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేసి యజమానితో సహా 150 మందిని అరెస్టు చేశారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉండడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
3.ఏపీ సీఎం జగన్ తన మాటకు కట్టుబడి కొత్త జిల్లాలను ఏర్పాటుచేశారు. రేపటినుంచి కొత్తజిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాం అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. అయితే వసతులు,సదుపాయాలు లేకుండా కొత్త జిల్లాల్ని ఏర్పాటుచేస్తే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. అమరావతి తరహాలో కొత్త జిల్లాలను చేయవద్దన్నారు. అమరావతి అభివృద్ధికి నిధులివ్వాలని కేంద్రాన్ని ఎందుకు అడగడంలేదన్నారు జీవీఎల్.
4.పాపులర్ సింగర్, ర్యాపర్ బాద్షా తనకు డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్ ఉందని తాజాగా వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చారు. “ఇండియాస్ గాట్ టాలెంట్ 9″షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న శిల్పా శెట్టి, బాద్షా “షేప్ ఆఫ్ యూ” అనే టాక్ షోలో మళ్ళీ కలిశారు. శిల్పా శెట్టి ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, తాజా ఎపిసోడ్ లో పాల్గొన్న బాద్షా తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “షేప్ ఆఫ్ యూ” నాల్గవ ఎపిసోడ్ లో బాద్షా తన ఫిట్‌నెస్ రహస్యాల గురించి, అలాగే క్లినికల్ డిప్రెషన్, తీవ్రమైన యాంగ్జయిటీ డిజార్డర్, స్లీప్ అప్నియాతో బాధపడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. అంతేకాదు ఒకప్పుడు పని కోసం ఆకలితో అలమటించేవాడినని కూడా చెప్పుకొచ్చాడు.
5 హైదరాబాద్ హైటెక్ నగరమే కాదు డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగానికి అడ్డాగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. తాజాగా బంజారాహిల్స్ లో రాడిసన్ హోటల్లోని ఫుడిండ్ అండ్ మింక్ పబ్ లో ప్రముఖుల పిల్లలు టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో దొరికిపోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ పబ్ లో డ్రగ్స్ గబ్బు రేపుతున్నాయి. ఇప్పటివరకూ పబ్బుల్లో డ్రగ్స్ దొరుకుతుందని వినడమే ఈసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయారు మత్తుగాళ్లు.
6.టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నారు అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్తలపై రానా భార్య మిహీక బజాజ్ క్లారిటీ ఇచ్చారు. స్టార్ కపుల్ రానా, మిహీక ఆగష్టు లో తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఈ అందమైన జంటకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మిహీకాకి ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇటీవల మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పంచుకోగా, ఆ ఫోటోలు ఆమె ప్రెగ్నన్సీ అనే ఊహాగానాలకు దారితీశాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమె బరువు పెరిగిందని గుర్తించారు. మిహీక బరువు పెరగడానికి కారణంప్రెగ్నన్సీ అంటూ రూమర్లు స్టార్ట్ అయ్యాయి.
Miheeka Bajaj : ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన రానా భార్య… ఇదీ సంగతి !
7.ఏపీలో అమరావతి విషయంలో ప్రభుత్వం తీరుని బీజేపీ తప్పుపడుతూనే వుంది. అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం ఒక షెడ్యూల్ ప్రకారం హామీలు అమలు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాజధాని పై హైకోర్టు తీర్పు అనంతరం సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారు.అఫిడవిట్ వివరాలు కోర్టు పరిధిలో ఉంటాయి.
8.అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి దేశ,విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. వాహనాల్లో వెళ్లే వారు ఘాట్ రోడ్డు ద్వారా తిరుమలకు చేరుకుంటుండగా, నడక మార్గం భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే అత్యంత ప్రాచీనమైన శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు.
9.తీవ్ర సంక్షోభంలో వున్న శ్రీలంకలో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్రరూపు దాల్చింది. ధరలు ఆకాశాన్నంటుతుండడం, నిత్యావసరాల కొరత, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో లంకేయులు అల్లాడిపోతున్నారు. దీంతో దేశంలో అరాచక పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వం 36 గంటల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. దీనికి తోడు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది.
10.సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి స్టయిలే వేరు. రాజకీయంగా ఎంత బిజీగా వున్నా తన పర్యటనలు మాత్రం కొనసాగిస్తూనే వుంటారు. తాజాగా ఆయన హైదరాబాద్ లోని కంది ఐఐటీ డైరెక్టర్ తో సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు నిర్మల జగ్గారెడ్డి ,కుమార్తె జయరెడ్డి ,కుమారుడు భరత్ సాయి రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఐఐటీ చుట్టూ పక్కల గ్రామాలలో ఉన్న యువతతో పాటు నియోజకవర్గంలోని యువతకు ,నిరుద్యోగులకు ఉద్యోగాల పై ఐఐటీ డైరెక్టర్ తో సమావేశంలో చర్చించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.