1.దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వరుసగా ప్రైవేట్ పరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు మార్చి 28, 29 తేదీల్లో భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి ముందుగా లావాదేవీలను పూర్తి చేసుకోవాలని సూచించింది.
2.ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అందించేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జూన్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. 2018 తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్ నిర్వహించలేదు. 2018 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంఆ వేల మంది విద్యార్ధులు బీఈడీ, డీఈడీ పూర్తి చేసి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో టెట్‌లో మంచి స్కోర్ సాధించడం తప్పనిసరి.
3.శరవేగంగా అభివృద్ధిచెందుతున్న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నిత్యం రద్దీగా వుండే కేపీహెచ్‌బీ కాలనీలో మోడల్ రైతుబజార్ ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు, మల్లారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లో మొదటగా ఎర్రగడ్డలో మోడల్ రైతుబజార్‌ను ఏర్పాటు చేయగా, కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో రెండో రైతుబజార్‌ను ఏర్పాటు చేశారు. వినియోగదారులకు అతి తక్కువ ధరకు ఇక్కడ కూరగాయలు లభిస్తాయి.
4.వేలాది మంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్ ను నిర్దేశించే బాసర ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయ పరిస్థితిని చూస్తే తీవ్ర ఆవేదన కలుగుతోందన్నారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల ట్రిపుల్ ఐటీ నిర్వహణ లోపభూయిష్టంగా మారింది. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ లేరు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేరు.
5.బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. సినిమాల నుంచి రిటైర్ మెంట్ ప్రకటించాలని అనుకున్నారు. ఏంటి ఇది నిజమా.. అయితే అమీర్ ఇక సినిమాలలో కనిపించడా..? అంటే కనిపిస్తారు. సినిమాలకు రిటైర్ మెంట్ ప్రకటించాలని ఒకానొకప్పుడు అనుకున్నారట.. ఆ విషయాన్నీ ఆయన ఇప్పుడు బయటపెట్టడంతో ఈ వార్త అభిమానులను కలవరింతకు గురిచేసింది. అసలు విషయమేంటంటే.. అమీర్ ఖాన్ బాలీవుడ్ లో స్టార్ హీరో..
6.తెలుగు ఇండియన్ ఐడిల్ సరదా సరదాగా సాగిపోతోంది. చూస్తుండగానే 10వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టేసింది. ఈ వీకెండ్ లో ‘సూపర్ హీరోస్ స్పెషల్’ పేరుతో చేసిన కార్యక్రమంలో శనివారం పన్నెండు మందిలో మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ తమ ప్రతిభను చాటారు. తొలుత శ్రీనివాస్ ధరంశెట్టి ‘ఇంద్ర’ సినిమాలోని ‘భం భం భోలే’ గీతాన్ని పాడాడు. మణిశర్మ స్వరపరచగా సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను మూవీలో శంకర్ మహదేవన్, హరిహరన్ గానం చేశారు. అదే విషయాన్ని తమన్ తలుచుకున్నారు. శివుడు పూనినట్టుగా ఈ పాటకు వాళ్ళంతా ప్రాణం పెట్టారని అన్నారు.
7.సింగరేణిని ప్రైవేటీకరిస్తున్నట్లు టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యాలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని, అది రాష్ట్ర ప్రభుత్వం చేతులో ఉందని బండి సంజయ్ ఉద్ఘాటించారు. అంతేకాకుండా సింగరేణి ఎన్నికలు వస్తుండటంతో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఆడే అబద్దాలకు అంతూపొంతు లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు…అన్నట్లుగా సిగ్గులేకుండా పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని ఆయన విమర్శించారు. అందుకే సింగరేణిని ప్రైవేటీకరించాలనే ప్రచారంలో…..
8. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో రామ్ చరణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిరుత, మగధీర, ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో తన నటనలో సత్తా చాటాడు. ఇక డ్యాన్స్ లోనూ తిరుగు లేదన్పించిన చెర్రీ ఎంతోమంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు.
9.న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా కల చెదిరింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు వైఫల్యం చెందారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 277/7 స్కోర్ చేశారు. స్మృతి మంధాన (71), షెఫాలీ వర్మ (53), మిథాలీ రాజ్ (68), హర్మన్‌ప్రీత్ కౌర్ (48) రాణించారు.
10.ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. నిబంధనల ప్రకారం ప్రతి టీమ్ నలుగురు విదేశీ ఆటగాళ్లను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంటుంది. కానీ రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్, వెస్టిండీస్ ఆటగాడు ఆర్.పావెల్‌కు మాత్రమే జట్టులో అవకాశం కల్పించింది. గతంలో 2011లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా కేవలం…
