1 ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వేగం పెంచింది. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వైఎస్ వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యపై ఇక విచారణే అవసరం లేదని, వివేకాను చంపిందెవరో ఇప్పటికే తేలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. వివేకాను చంపిందెవరో అందరికీ తెలిసిపోయిందని, ఆ హత్యకు వైఎస్ కుటుంబీకులే నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
2.బీజేపీ కార్యాలయంలో ఫొటోగ్రాఫర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరయ్యారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. వివిధ జిల్లాల నుంచి సమావేశానికి హాజరయ్యారు ఫొటో గ్రాఫర్లు. ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. ఆత్మనిర్భర్ భారత్ లో చేతి వృత్తుల వారిని ప్రోత్సహించాలని మోడీ చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేందుకు మోడీ పాలనే కారణం.
3.ప్రజాస్వామ్య భావాలపై విశ్వాసం ఉన్న నాయకులు వైసీపీని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి సంకుచిత మనస్తత్వంతో నియంతలా ఆలోచిస్తున్నారు. ప్రజాస్వామ్యం కోసం.. రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ తో కలసి నడిచేందుకు రండి. ప్రజల కోసం పని చేయాల్సిన రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్ల దగ్గరకు పంపారు. అహంభావానికి, ఆత్మగౌరవానికి జరిగే పోరులో గెలిచేది ఆత్మ గౌరవమే అని నిరూపించారు. సంయమనంతో… సహనంగా ఉన్న జన సైనికులకు, అభిమానులకు అభినందనలు.
3.రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునే పనిలోపడిపోయాయి రష్యా దళాలు.. అధ్యక్ష భవనాన్ని కూడా చుట్టుముట్టాయి.. ఇదే సమయంలో.. వరుస వీడియోలు విడుదల చేస్తూ.. ఆయుధాలు వీడొద్దు అంటూ పిలుపునిస్తున్నారు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. మొదటి వీడియోలో తాను ఇక్కడే ఉన్నాను.. పోరాడుతాం.. ఉక్రెయిన్‌ను కాపాడుకుంటా.. ఆయుధాలు కావాలని పేర్కొన్న ఆయన.. ఇక, రెండో వీడియోలో ఏకంగా కీవ్ వీధుల్లో తిరుగుతూ చేశారు.. ఆయుధాలు వీడొద్దు అని కోరారు.
4 మూడు డ్రగ్స్ కేసులలో 11 మంది అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శనివారం ఆయన బషీర్‌బాగ్‌లో సీపీ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4.50 లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్, లాప్ టాప్ మొబైల్ ఫోన్లు సీజ్ చేసామని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఏడుగురిని అరెస్ట్ చేయగా.. ఒకరు పరారీ లో ఉన్నారన్నారు. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత పెద్ద ఎత్తున డ్రగ్స్ సరరా చేస్తున్న ముఠా అరెస్ట్ చేశామన్నారు.
5.తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా హట్‌టాపిక్‌గా మారింది. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం జీవో 35ను ప్రవేశపెట్టి.. తక్కువ ధరలకే సినిమా టికెట్లను విక్రయించాలని ఆదేశించింది. అయితే తెలంగాణ మాత్రం భీమ్లానాయక్ సినిమాకు 5షోలు ప్రదర్శించేందుకు అనుమతించారు. అంతేకాకుండా బెనిఫిట్ షోలకు కూడా అనుమతులు ఇచ్చారు.
6.ప్రస్తుతం అత్యంత ఆదరణ పొందిన టెక్నాలజీల్లో బ్లాక్ చెయిన్, మెటావర్స్ టెక్నాలజీలు పటిష్టమైనవి. ఈ రెండు టెక్నాలజీలను అనుసంధానం చేస్తు హైదరాబాద్‌కు చెందిన గేమింగ్ ఇండస్ట్రీ ఓ గేమ్‌ను క్రియోట్ చేసింది. ఈ గేమ్ లో హైలెవల్ కు వెళ్లే కొద్ది క్రిప్టో టోకెన్లను గెలుచుకోవచ్చని, ఈ టోకెన్లను క్రిప్టో ఎక్చేంజ్ ద్వారా సొమ్ము చేసుకోవచ్చని గేమ్ తయారీదారులు చెబుతున్నారు. హైదరాబాద్ స్టార్టప్ సంస్థ క్లింగ్ ట్రేడింగ్ సంస్థ ఈ గేమ్‌ను రూపొందించింది. ప్రస్తుతం బీటా వెర్షన్ మార్చిలో అందుబాటులోకి రానున్నట్టు గేమింగ్ నిర్వహాకులు తెలిపారు.
7.ఆ శివుడు ఊరుకోడు.. మూడో కన్ను తెరుస్తాడు.. సీఎం కేసీఆర్ సంగతి తేలుస్తాడు అని ఫైర్ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన దీక్ష సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయానికి ఏడాదికి 100 కోట్ల చొప్పున ఇస్తా అన్నాడు.. అందుకు రూ. 700 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. కేసీఆర్ కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆయనకు సంస్కారం లేదు..
8.5 సీజన్‌ల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న “బిగ్ బాస్ షో” ఇప్పుడు కొత్తగా OTT వెర్షన్ తో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో “బిగ్ బాస్ నాన్ స్టాప్” అనే కొత్త వెర్షన్ తో ఫిబ్రవరి 26 నుంచి అందరినీ అలరించడానికి రెడీ గా ఉంది. ఈ “బిగ్ బాస్ నాన్ స్టాప్” ప్రత్యేకత ఏమిటంటే 24 గంటలూ డిస్నీలో ప్రసారం కానుంది. ఇప్పుడు రాబోతున్న ఓటిటి వెర్షన్ గతంలో కంటే మరింత స్పైసీగా, ధైర్యంగా, క్రేజీగా, వినోదాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే నాగార్జున ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.
9.ధర్మశాల వేదికగా శనివారం రాత్రికి టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ధర్మశాలలో ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రానికి వర్షం ఆగిపోయినా మబ్బులు ఉంటాయన్నారు. పైగా ఆదివారం జరిగే మూడో మ్యాచ్‌పైనా వాతావరణ ప్రభావం ఉండొచ్చని తెలిపారు.
10.పవన్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం ఫ్యాన్స్ లోనే కాదు ఇండస్ట్రీలో చాలా మందిలో ఉత్సాహాన్ని నింపింది. ‘అఖండ’ తర్వాత టాలీవుడ్ లో కొత్త జోష్ వచ్చింది ఈ సినిమాతో. ఇదిలా ఉంటే ఈ సినిమా విజయం పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల దర్శకనిర్మాతల మోముపై చిరునవ్వులు చిందేలా చేసింది. వారే పవన్ తో ‘హరిహరవీరమల్లు’ చిత్రం తీస్తున్న నిర్మాత ఎ.ఎం.రత్నం, దర్శకుడు క్రిష్. ‘భవదీయుడు భగత్ సింగ్’ నిర్మిస్తున్న మైత్రీమూవీస్, దర్శకుడు హరీశ్ శంకర్.
