Site icon NTV Telugu

Top News: టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1 ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఇంకా స్పష్టత నెలకొనలేదు. దీంతో తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్నా సినిమాలపై భారం పడే అవకాశం ఉంది. అయితే ఈనెల 25న పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్‌’ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ.. ఏపీలో జీవో 35 ప్రకారమే సినిమా టికెట్‌లు విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ సినిమాలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. 

https://ntvtelugu.com/jc-prabhakar-reddy-made-comments-on-cinema-tickets/

2.ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా ఉక్రెయిన్‌ పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ చిక్కుకున్న కొంత మంది విద్యార్థులతో ఫోన్ లో మాట్లాడామని, వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు ఏపీ విద్యామంత్రి ఆదిమూలపు సురేష్. అక్కడ సుమారు 4 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారం అందించటానికి ఇద్దరు అధికారులను నియమించింది ఏపీ ప్రభుత్వం.

https://ntvtelugu.com/adimoolapu-suresh-get-assurance-to-ukraine-students/

3.ఏపీలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజారెడ్డి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయ్యన్నపాత్రుడు మొదటిసారి మంత్రి అయ్యేటప్పటికి జగన్ పాలుతాగుతున్నాడు.అయ్యన్నపాత్రుడు ని ఎదుర్కోలేక ముఖ్యమంత్రి పోలీసులను పంపిస్తున్నారని విమర్శించారు.

https://ntvtelugu.com/nara-lokesh-fires-on-jagan-govt-rules/

4.ధరణి పోర్టల్‌లోని లోపాలపై కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిందని, కానీ కాంగ్రెస్ సూచనలను, సలహాలను కేసీఆర్ పట్టించుకోలేదని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణిలో లోపాలను సరిచేసేందుకు హరీష్ రావు కమిటీ కేవలం కంటి తుడుపు చర్యనేనని ఆయన మండిపడ్డారు. 

https://ntvtelugu.com/congress-leader-kondanda-reddy-about-dharani-portal/

5.రాజమండ్రిలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీలు, ఆశావర్కర్ల ఆందోళనలపై ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ పేదల పక్షపాతి వారి ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వంపై ఈర్ష్యతో ప్రతిపక్షాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాయి.

https://ntvtelugu.com/taneti-vanitha-fires-on-chandrababu/

6.బీజేపీ సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసుకుంటోందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనీ.. అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి పథకం, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు కింది స్థాయి వరకు చేరేలా ప్రయత్నం చేయాలని కార్యకర్తలకు సూచించారు. 

https://ntvtelugu.com/minister-prashanth-reddy-warns-to-bjp-leaders/

7.ఏపీ ప్రభుత్వంలో కొంతకాలం క్రితం వరకూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ సవాంగ్ అనూహ్యంగా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఏపీ మాజీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ఈ రోజు ఖాకీ డ్రెస్ వ‌దిలేశారు. ఎంచ‌క్కా సూటు వేసుకుని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. 

https://ntvtelugu.com/goutham-sawang-take-charge-as-appsc-chairman/

8.కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్, డైరెక్టర్ హెచ్.వినోద్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘వలిమై’. గతంలో ఈ ఇద్దరితో హిందీ ‘పింక్’ను తమిళంలో ‘నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్ చేసిన బోనీ కపూర్ ఇప్పుడీ సినిమా నిర్మించారు. తెలుగువాడైన కార్తికేయ విలన్ గా నటించడంతో మనవారికీ ఈ మూవీ మీద కాస్తంత ఆసక్తి పెరిగింది. అయితే… అజిత్, హెచ్. వినోద్, బోనీకపూర్ కాంబోలో వచ్చిన ఈ సెకండ్ మూవీ అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.

https://ntvtelugu.com/ajith-kumar-valimai-movie-review-and-rating/

9.‘గంగూబాయ్ కథియావాడి’ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ సుప్రీమ్ కోర్టులో వేసిన కేసు వీగిపోయింది. గంగూబాయి పెంపుడు కొడుకునంటూ షా అనే వ్యక్తి చేసిన అభ్యర్థనను సుప్రీమ్ కోర్టు గురువారం తిరస్కరించింది. తన తల్లి గౌరవానికి భంగం కలిగించేలా సినిమాలోని సన్నివేశాలు ఉన్నాయని, దాని విడుదలపై స్టే ఇవ్వాలని, లేదంటే పేరు మార్చాలని కోరిన షా వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. 

https://ntvtelugu.com/sc-dismisses-plea-seeking-stay-on-release-of-gangubai-kathiawadi/

10.బిగ్ బాస్ తమిళ్ OTT వెర్షన్ “బిగ్ బాస్ అల్టిమేట్” పేరుతో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ షో కొత్త హోస్ట్‌ని ఇప్పుడు పరిచయం చేశారు మేకర్స్. ఇప్పటి వరకూ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా ఉన్న కమల్ హాసన్ కొన్ని అనివార్య కారణాల వల్ల షో నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. షో నుండి నిష్క్రమిస్తున్నట్లు వారాంతపు ఎపిసోడ్‌లో ప్రకటించిన తర్వాత కమల్ హాసన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. 

https://ntvtelugu.com/silambarasan-tr-is-the-new-host-of-bigg-boss-ultimate/
Exit mobile version