Site icon NTV Telugu

Ntv Topnews: టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌ తరహాలో మాటల తూటాలు పేలుతుంటాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనపై మండిపడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీ ప్రభుత్వంలో వీఆర్ఒల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందన్నారు రేవంత్. గొడ్డు చాకిరీ చేయించుకుని… వాళ్ల హక్కులను కాలరాస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. 

https://ntvtelugu.com/revanth-letter-to-kcr-on-vros-promotions/

2.తెలంగాణ మీద కక్ష తోనే కేంద్రం సహకరించడం లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఆయన మండిపడ్డారు. బయ్యారం, ఖమ్మం ప్రాంతంలో ఖనిజ సంపద ఉందని సర్వేలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

https://ntvtelugu.com/nama-nageswara-rao-fired-on-kishareddy/

3.సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి నిస్సహాయ ప్రకటన చేసినా అర్థం ఉందని, కానీ ఇప్పుడు కేంద్రమంత్రి హోదాలో ఉంది కూడా నిస్సహాయంగా ఉన్నారని మంతి పువ్వాడ అజయ్‌ విమర్శలు గుప్పించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాదని నిరుద్యోగ యువత ఆశల మీద కిషన్ రెడ్డి నీళ్లు చల్లారని ఆయన మండిపడ్డారు. బయ్యారంలో ఉక్కు నిల్వలు ఉన్నాయని జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్రంది ఉక్కు సంకల్పం కాదు… అది తుక్కు సంకల్పం అని ఆయన ఎద్దేవా చేశారు.

https://ntvtelugu.com/puvvada-ajay-about-bayyaram-steel-plant/

4.వికారాబాద్ జిల్లాలో ఆశ కార్యకర్తలకు ఎంపీ, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ తో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్మార్ట్ ఫోన్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో వైద్య శాఖకు తోడుగా ఆశ కార్యకర్తలు నిలబడి సహకారం అందించటం గొప్ప విషయమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 

https://ntvtelugu.com/the-fever-survey-was-ideal-for-the-country/

5.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కియా మోటార్స్ కంపెనీ కార్ల ఉత్ప‌త్తి కేంద్రాన్ని నెల‌కొల్పిన సంగ‌తి తెలిసిందే. అనంత‌పురంలో నెల‌కొల్పిన ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున కార్ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అనంత‌పురం ప్లాంట్ నుంచి 5 ల‌క్ష‌ల కార్ల‌ను ఉత్ప‌త్తి చేసిన‌ట్టు కంపెనీ యాజ‌మాన్యం తెలియ‌జేసింది. ఇందులో నాలుగు ల‌క్ష‌ల కార్ల దేశీయ మార్కెట్లోకి విడుద‌ల చేయ‌గా, ల‌క్ష కార్ల‌ను విదేశాల‌కు ఎగుమ‌తి చేసిన‌ట్లు కంపెనీ వ‌ర్గాలు పేర్కొన్నాయి

https://ntvtelugu.com/five-lakh-kia-cars-producing-from-anantapuram-plant/

6.ఈమధ్యకాలంలో రైల్వే ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. అయితే, సకాలంలో స్పందించిన పోలీసులు ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. తాజాగా వరంగల్‌ లో ఓ కానిస్టేబుల్ చేసిన పనికి అందరిచేత ప్రశంసలు లభిస్తున్నాయి. 20 మంది సభ్యుల బృందం కృష్ణా ఎక్స్ ప్రెస్ లో తిరుపతి నుంచి వరంగల్ వస్తోంది. వరంగల్ జిల్లా భీమారం గ్రామానికి చెందిన ఒక మహిళ కృష్ణా ఎక్స్ ప్రెస్ లో తిరుపతి నుంచి వరంగల్ వస్తుండగా ట్రైన్ వరంగల్ లో ఆగిన సందర్భంలో దిగలేకపోయింది. ట్రైన్ కదిలిపోయింది.

https://ntvtelugu.com/constable-saves-women-life-in-warangal-railway-station/

7.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టినా విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ పై అభిమానులు కాసింత అసహనం వ్ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సంగీత దర్శకుడు థమన్ పై ట్రోలింగ్ చేస్తున్నారు. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత బాలేదని, ఇంకా గట్టిగా కొట్టి ఉంటే ట్రైలర్ ఓ రేంజ్ లో ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు.

https://ntvtelugu.com/music-director-thaman-tweet-viral/

8.చదలవాడ సోదరులు తిరుపతిరావు, శ్రీనివాసరావు కశ్మీర్ లో నిర్మించిన మ్యూజికల్ లవ్ స్టొరీ ‘రోజ్ గార్డెన్’. నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ టీజర్ ను ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 

https://ntvtelugu.com/rose-garden-telugu-movie-teaser/

9.సీనియర్ హీరో నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. భర్త పేరు చెప్పి ఆమె చాలామంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే సీనియర్ హీరో నరేష్ కి రమ్య రఘుపతితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే కొన్ని రోజులు కలతలు లేకున్నా సాగిన వీరి కాపురంలో విభేదాలు రావడంతో వీరిద్దరు విడిగా ఉంటున్నారు.

https://ntvtelugu.com/actor-naresh-ex-wife-ramya-raghupathi-arrest/

10.ఇవాళ ట్విన్స్ డే. ఒకే తల్లి కడుపున కవలలుగా జన్మించిన వారంతా కలిసి చేసుకునే అద్భుతమయిన వేడుక అది. సాగరతీరం విశాఖలో కవలలు సందడి చేశారు. విశాఖలో 30కి పైగా కవల జంటలు ఆడి పాడారు. అందరితో సంతోషంగా గడిపారు. ఒకేరూపం మనుషులు మాత్రం ఇద్దరు. అదేదో సినిమాలో చూసినట్టుగా వీరంతా ఒకేచోట కలిసి చేసిన సందడి అదరహో అనిపించింది.

https://ntvtelugu.com/twins-day-festival-in-vishakapatnam/
Exit mobile version