1.ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఇరు దేశాల యుద్ధం ప్రారంభమై మంగళవారం నాటికి ఆరు రోజులు అవుతోంది. రోజురోజుకు యుద్ధం తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడుల్లో భారత్‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌లో రష్యా మిస్సైల్ దాడిలో కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి నవీన్ మరణించాడు.
2.దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు సడలిస్తుండటంతో గత నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరిలో మొత్తం 1,33,026 కోట్ల వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే 18 శాతం అధికంగా రూ.1.33 లక్షల కోట్ల రాబడి వచ్చింది. ఒక నెలలో రూ.1.30 లక్ష కోట్ల మార్కు దాటడం జీఎస్‌టీ చరిత్రలో ఇది ఐదోసారి. మొత్తం నమోదైన వసూళ్లలో సీజీఎస్‌టీ ద్వారా రూ.24,435 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ ద్వారా రూ.30,779 కోట్లు, ఐజీఎస్‌టీ ద్వారా రూ.67,471 కోట్లు వచ్చాయి.
3.బీజేపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. బీజేపీ నేతలను మెంటల్ ఆసుపత్రులలో చేర్పిస్తారన్నారు హరీష్ రావు. ప్రొరోగ్ అంశం స్పీకర్ పరిధి లోనిది. బీజేపీ నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడాలో తెలియక.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గవర్నర్ మహిళ కదా అందుకే సభకు పిలవడం లేదంటుంది బీజేపీ. అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు మహిళా లోకం నీ అవమానించాయి. అస్సాం సీఎం వ్యాఖ్యలు సమర్ధించారు బండి సంజయ్.
4.సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వెస్ట్ మారేడ్‌పల్లిలో నూతనంగా నిర్మించిన 468 డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభానికి సిద్ధమైయ్యాయి. ఈ నెల 3వ తేదీన ఉదయం 9:30 గంటలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మొత్తం 5.18 ఎకరాల విస్తీర్ణంలో 36.27 కోట్ల రూపాయల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. రూ. 3.51 కోట్ల వ్యయంతో రోడ్లు, విద్యుత్, డ్రైనేజి, సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
5.తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్, బీజేపీలు వరుసగా మాటల దాడి చేస్తూనే వున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ పై మళ్ళీ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై సోమవారం తీవ్ర విమర్శలు చేశారు.
6.మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి చర్చగా మారింది.. ఈ కేసులో సీబీఐకి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది.. ఇక, ఆమె అవినాష్‌రెడ్డి పాత్రపై విచారణ జరపాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడంతో.. వాంగ్మాలంలో సీఎం వైఎస్ జగన్ పేరు ప్రస్తావించడం పెద్ద చర్చకు దారి తీసింది.. ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. సంచలన వ్యాఖ్యలు చేశారు..
7.అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం వెలిగిపోతోందని, విజయపథంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, దీనికి కేంద్రం విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని వెల్లడించారు. తలసరి ఆదాయం 2014 నుంచి 2021 వరకు 125 శాతం పెరిగినట్లు కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. జీఎస్‌డీపీ 130 శాతం పెరిగినట్లు తెలిపారు.
8.ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు బైపాస్ రోడ్డులోని ఉడ్ కాంప్లెక్స్ శివారులో పార్కింగ్ చేసి ఉన్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సులో తొలుత మంటలు చెలరేగగా.. ఆ మంటలు నెమ్మదిగా పక్కన ఉన్న బస్సులకు కూడా వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 8 ప్రైవేట్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయని తెలుస్తోంది.
9.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రేక్షకులకు తమ చిత్రాల పోస్టర్స్ ద్వారా పలువురు దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఆ వరుసలోనే నిలిచింది ‘ది మాన్షన్ హౌస్’ చిత్ర బృందం. తలారి వీరాంజనేయ సమర్పణలో బీసీవీ సత్య రాఘవేంద్ర ‘ది మాన్షన్ హౌస్’ మూవీని నిర్మిస్తున్నారు. సునీల్ మెహర్, యశ్, వృందా కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేమంత్ కార్తిక్ దర్శకత్వం వహించే ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ను మంగళవారం విడుదల చేశారు.
10.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరగా ఆమె నిశ్శబ్దం సినిమాతో అభిమానులను పలకరించింది. ఇక మద్యమద్యలో హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఎయిర్ పోర్టు లో కనిపించడం తప్ప స్వీటీ దర్శనం కూడా లేదు. ఇక ఇటీవలే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా ఒప్పుకున్నది. మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన అనుష్క నటించనుంది.అయితే చాలారోజుల నుంచి అనుకశాఖ పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడానికి చూస్తుంది. అందుకే వరుస సినిమాలను ఒప్పుకోవడంలేదనే టాక్ వినిపిస్తోంది.
