Vasantha Haimavathi Passes Away: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ఫ్యామిలీలో విషాదం..

Vasantha Haimavathi

Vasantha Haimavathi

Vasantha Haimavathi Passes Away: వసంత ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు సతీమణి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తల్లి వసంత హైమావతి కన్నుమూశారు.. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. గురువారం మధ్యాహ్నం అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో నందిగామ మండలం ఐతవరం గ్రామంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో వసంత కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక, వసంత హైమావతి మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు..