NTV Telugu Site icon

Alla Nani: టీడీపీలో మాజీ మంత్రి ఆళ్ల నాని చేరికకు బ్రేక్‌..!

Alla Nani

Alla Nani

Alla Nani: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. అయితే, టీడీపీలో మాజీ మంత్రి ఆళ్ల నాని చేరికకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు.. ఆళ్ల నాని.. టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. అంతేకాదు.. ఆళ్లనాని టీడీపీలోకి వస్తే.. ఆయన వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదని.. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తేల్చిచెప్పారు.. గతంలో టీడీపీ నేతలను టార్గెట్‌ చేసి.. వేధింపులకు గురిచేశారని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో, ఆళ్ల నాని చేరికను పోస్ట్‌పోన్ చేసింది టీడీపీ.. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చించిన తర్వాత.. దీనిపై ఓ నిర్ణయానికి రానుంది టీడీపీ అధిష్టానం..

Read Also: Bleeding Eye Virus: ప్రాణంతకంగా మారుతున్న ‘బ్లీడింగ్ ఐ వైరస్’.. లక్షణాలివే?

ఏలూరు అసెంబ్లీ, జోనల్ నాయకులతో చర్చించిన అనంతరం నాని చేరికపై స్పష్టత ఇవ్వనున్నారట పార్టీ పెద్దలు.. కార్యకర్తలు అందరితోటి మాట్లాడిన అనంతరం వారి అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి అచ్చెం నాయుడు.. టీడీపీ కార్యకర్తలకు స్పష్టం చేశారట.. కాగా, మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యిందని వార్తలు వచ్చాయి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని.. మూడు నెలల క్రితమే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి ఎవరికీ అందుబాటులో లేని ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆళ్ల నాని చేరికకు పార్టీ పెద్దలు అంగీకరించినట్లుగా ప్రచారం జరిగింది.. దీంతో నేడో ,రేపో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం ఉందని గుసగుసలు వినిపించాయి.. కానీ, లోకల్ క్యాడర్‌ వ్యతిరేకించడంతో ఆళ్ల నాని చేరిక తాత్కాలికంగా వాయిదా పడింది..

Show comments