NTV Telugu Site icon

AP Govt: ఎన్టీపీసీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం..

Ntpc

Ntpc

AP Govt: ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ కార్యాలయాలపై 300 మెగావాట్ల సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎన్టీపీసీ- ఏపీ నెడ్ క్యాప్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలపై సోలార్ ప్యానెల్స్ అమర్చేందుకు వీలుగా సంస్థల మధ్య ఒప్పందం చేసుకున్నాయి. 2025 నాటికి ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం సోలార్ ప్యానెల్స్ అమర్చాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.

Read Also: Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024 స్క్వాడ్స్ ప్రకటన.. కెప్టెన్స్ వీళ్లే..!

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సౌర విద్యుత్ ఉత్పత్తి చేయటంతో పాటు పొల్యూషన్ తగ్గింపు దిశగా 25 ఏళ్ల పాటు ఈ ఒప్పందం విద్యుత్ వ్యయాన్ని తగ్గిస్తుంది అన్నారు. 300 మెగావాట్ల విద్యుత్ రూఫ్ టాప్ వ్యవస్థల ఏర్పాటు ద్వారా ఏటా రూ. 118.27 కోట్ల మేర విద్యుత్ ఆదా అవుతుంది.. 25 ఏళ్లలో రూ.2957 కోట్ల మేర ఆదా కానుంది.. దీంతో పాటు ఏడాదికి 3.41 లక్షల మెట్రిక్ టన్నుల మేర పొల్యూషన్ తగ్గుతుంది అని చెప్పుకొచ్చారు. 25 ఏళ్లలో 85. 25 లక్షల మెట్రిక్ టన్నుల మేర పొల్యూషన్ తగ్గించగలం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.