CM Chandrababu: తెలంగాణ రాష్ట్రంతో గొడప పడే అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది నేనే.. అమరావతిని కూడా హైదరాబాద్ స్థాయిలో అభివృధ్ధి చేసే బాధ్యత నాది అన్నారు. ఇక, గోదావరి నీళ్లు వాళ్ళు వాడుకుంటారు, మనం వాడుకుంటాం.. ప్రధాని మోడీ కూడా నదుల అనుసంధానం చేయాలనుకుంటున్నారు అని గుర్తు చేశారు. వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తాం.. హంద్రీనీవా నీరు చిత్తూరు వరకు వెళ్ళాలి.. ఇపుడు కుప్పం వరకు వెళ్తాయి.. వచ్చే ఏడాది చిత్తూరు వరకు తీసుకువెళ్తామన్నారు. 2021లో పొలవరాన్ని గోదావరిలో ముంచేశారు అని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
Read Also: Dasoju Sravan: రాష్ట్రంలో రోజుకు 8 రేప్‌లు..? ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు..
ఇక, ప్రజల ఆలోచనలు, కోరికలు ఎక్కువగా ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. గల్లా పెట్టె ఖాళీగా ఉంది.. ఇవన్నీ చేయడానికి సమయం కావాలి.. మళ్లీ భూతం వస్తే ఎలా అని భయపడుతున్నారు.. భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది.. కులం కూడు పెడుతుందా.. మతం ఒక విశ్వాసం అని చెప్పుకొచ్చారు. హిందువులు మల్లీకార్జున స్వామిని, ముస్లింలు ఖురాన్, క్రైస్థవులు యేసును ప్రార్ధిస్తారు అని పేర్కొన్నారు. కొంతమంది రాక్షసులు నా యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి కోసం నేను ఒక్కడే పరిగెత్తితే లాభం లేదు.. మా నాయకులను కూడా పరిగెత్తిస్తున్నాను.. రాయలసీమను కొందరు కేవలం ఓట్ల కోసం వాడుకున్నారు.. ఒక నాయకునికి రాయలసీమ అంటే రక్తం, రాజకీయం.. మరి నాకు రాయలసీమ అంటే నీళ్లు, మీ భవిష్యత్తు అని చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Tollywood: పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. అంతా గజిబిజి గందరగోళం
అలాగే, రైతులకు శుభవార్త.. కేంద్రం రైతు భరోసా ఇచ్చిన రోజునే మనవాటా అదే రోజున వేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆగస్టు నాటికి అందరు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఆగష్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం.. ఆగష్టు 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం.. సెల్ ఫోన్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి రాననున్నాయి. దీంతో పాటు ఆగస్టు 20లోగా స్కూళ్లకు 16, 500 టీచర్లను పంపే బాధ్యత నాది.. గతంలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు అని చంద్రబాబు నాయుడు తెలియజేశారు.
