NTV Telugu Site icon

కలకలం రేపుతున్న మరో కుటుంబం ఆత్మహత్య

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఇటీవల రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే వీరి సూసైడ్ వెనుక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని ఆరోపణలు రావడం… అతడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీలో తాజాగా మరో కుటుంబం ఆత్మహత్య కలకలం రేపుతోంది. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అమ్మవారి దర్శనం అనంతరం విజయవాడ వన్‌టౌన్‌లోని కన్యకాపరమేశ్వరి సత్రంలో విషం తాగి తల్లి, కొడుకు మృతి చెందగా… మరో కుమారుడితో కలిసి తండ్రి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Read Also: ఏపీ వైపు పారిపోతుండగా… వనమా రాఘవ అరెస్ట్

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈనెల 6న నిజామాబాద్ నుంచి కుటుంబం విజయవాడకు వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దర్శనానికి వచ్చి పప్పుల అఖిల్ పేరుతో వాసవి సత్రంలో కుటుంబం రూమ్‌ తీసుకుందన్నారు. అయితే అప్పులబాధతో చనిపోతున్నట్లు బంధువుకు వారు మెసేజ్ పెట్టి సూసైడ్ చేసుకున్నారు. సత్రంలో చనిపోయినవారు శ్రీలత(54), ఆశిష్‌(22)గా… కృష్ణానదిలో దూకి చనిపోయినవారు సురేష్(56), అఖిల్‌(28)గా పోలీసులు గుర్తించారు.