ఏపీ వైపు పారిపోతుండగా… వనమా రాఘవ అరెస్ట్

పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న A2 నిందితుడు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మీదుగా వాహనంలో ఏపీ వైపు పరారవుతున్న రాఘవను చింతలపూడి వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనమా రాఘవ అరెస్టును జిల్లా ఎస్పీ సునీల్ దత్ ధ్రువీకరించారు. రాఘవను ఎస్పీ కార్యాలయంలో విచారించిన అనంతరం శనివారం నాడు కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది.

Read Also: ఆ స్టార్ హీరో ప్రేమలో నిధి అగర్వాల్.. త్వరలోనే పెళ్లి..?

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తర్వాత రాఘవకు సంబంధించిన మరిన్ని అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. పాల్వంచ ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో విచారించేందుకు ఏఎస్పీ ఎదుట శుక్రవారం హాజరు కావాలంటూ గురువారం అర్ధరాత్రి రాఘవ తండ్రి వనమా వెంకటేశ్వరరావు నివాసానికి పోలీసులు నోటీసులు అంటించారు. అయితే పరారీలో ఉన్న రాఘవ హాజరు కాలేదు. మరోవైపు విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయిన టీఆర్ఎస్ పార్టీ రాఘవను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Related Articles

Latest Articles