NTV Telugu Site icon

Nitin Gadkari: వాయు కాలుష్యం ప్రధాన సమస్య.. భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదే

Nitin Gadkari

Nitin Gadkari

వాయు కాలుష్యం అన్నింటికంటే ప్రధాన సమస్య అన్నారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ… ఐదు లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదార్లను అభివృద్ధి చేస్తున్నాం అన్నారు.. 2024 నాటికి ఏపీలో ఐదు లక్షల కోట్ల హైవే ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి కానున్నాయని వెల్లడించారు.. ఇక, ఏపీకి రానున్న మూడు నెలల్లో మరో 3 వేల కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేస్తాం అని హామీ ఇచ్చారు. షిప్పింగ్ లో ఆంధ్రప్రదేశ్ దేశానికి ముఖ్యమైన రాష్ట్రంగా పేర్కొన్నారు గడ్కరీ.. ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తే లాజిస్టిక్ పార్క్ మంజూరు చేస్తామన్న ఆయన.. భువనేశ్వర్ నుంచి విశాఖ భోగాపురం వరకూ ఆరు లైన్ల హైవే, విజయవాడ తూర్పు బైపాస్ మంజూరు చేస్తామన్నారు.. రాజమండ్రి – కాకినాడ కెనాల్ రోడ్ ను మంజూరు చేస్తామన్నారు.. ఇక, ఇప్పుడు వాయు కాలుష్యం అన్నింటికంటే ప్రధాన సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.. భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదే అని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ.

Read Also: NTR: జూనియర్ యన్టీఆర్ ట్వీట్ పై విమర్శలు!

ఇక, రాజమండ్రిలో పర్యటించిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.. ఐదు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేశారు. ఈ ఐదింటిని 216 నేషనల్‌ హైవేపై నిర్మిస్తుండటం విశేషం. రాజమండ్రిలోని ఆర్ట్స్‌ కాలేజీ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభ వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు. జాతీయ రహదారి నంబర్‌ 216 పై మోరంపూడి, జొన్నాడ జంక్షన్‌, ఉండ్రాజవరం జంక్షన్‌, తేతాలి, కైకవరం వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. ఇందుకు దాదాపు రూ.3 వేల కోట్ల నిధులు కేటాయించారు. వాకలపూడి-ఉప్పాడ-అన్నవరం జాతీయ రహదారిపై లేనింగ్‌, సామర్లకోట-అచ్చంపేట జంక్షన్‌ హైవేపై 4 లేనింగ్‌, రంపచోడవరం నుంచి కొయ్యూరి వరకు జాతీయ రహదారిపై 2 లేన్ల నిర్మాణం పనులకు కూడా నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో వచ్చినప్పుడు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉన్నదన్నారు. కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండటం వల్ల విచారం వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల వెంబడి పెద్ద మొత్తంలో మొక్కలు నాటి వాతావరణాన్ని కాలుష్యరహితంగా మార్చాలని పిలుపునిచ్చారు.