Nitin Gadkari: వాయు కాలుష్యం ప్రధాన సమస్య.. భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాయు కాలుష్యం అన్నింటికంటే ప్రధాన సమస్య అన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ… ఐదు లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదార్లను అభివృద్ధి చేస్తున్నాం అన్నారు.. 2024 నాటికి ఏపీలో ఐదు లక్షల కోట్ల హైవే ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి కానున్నాయని వెల్లడించారు.. ఇక, ఏపీకి రానున్న మూడు నెలల్లో మరో 3 వేల కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేస్తాం అని హామీ ఇచ్చారు. షిప్పింగ్ లో ఆంధ్రప్రదేశ్ దేశానికి ముఖ్యమైన రాష్ట్రంగా పేర్కొన్నారు గడ్కరీ.. ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తే లాజిస్టిక్ పార్క్ మంజూరు చేస్తామన్న ఆయన.. భువనేశ్వర్ నుంచి విశాఖ భోగాపురం వరకూ ఆరు లైన్ల హైవే, విజయవాడ తూర్పు బైపాస్ మంజూరు చేస్తామన్నారు.. రాజమండ్రి – కాకినాడ కెనాల్ రోడ్ ను మంజూరు చేస్తామన్నారు.. ఇక, ఇప్పుడు వాయు కాలుష్యం అన్నింటికంటే ప్రధాన సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.. భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదే అని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.
Read Also: NTR: జూనియర్ యన్టీఆర్ ట్వీట్ పై విమర్శలు!
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ఇక, రాజమండ్రిలో పర్యటించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. ఐదు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేశారు. ఈ ఐదింటిని 216 నేషనల్ హైవేపై నిర్మిస్తుండటం విశేషం. రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభ వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు. జాతీయ రహదారి నంబర్ 216 పై మోరంపూడి, జొన్నాడ జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, తేతాలి, కైకవరం వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. ఇందుకు దాదాపు రూ.3 వేల కోట్ల నిధులు కేటాయించారు. వాకలపూడి-ఉప్పాడ-అన్నవరం జాతీయ రహదారిపై లేనింగ్, సామర్లకోట-అచ్చంపేట జంక్షన్ హైవేపై 4 లేనింగ్, రంపచోడవరం నుంచి కొయ్యూరి వరకు జాతీయ రహదారిపై 2 లేన్ల నిర్మాణం పనులకు కూడా నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో వచ్చినప్పుడు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉన్నదన్నారు. కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండటం వల్ల విచారం వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల వెంబడి పెద్ద మొత్తంలో మొక్కలు నాటి వాతావరణాన్ని కాలుష్యరహితంగా మార్చాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!