Site icon NTV Telugu

Nirmala Sitharaman: అమరావతి నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం.. దేశంలోనే ఇది మొదటిసారి!

Nirmala Sitharaman

Nirmala Sitharaman

అమరావతి నగరాన్ని నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. నూతన రాజధాని అమరావతిని మరలా పునఃప్రారంభించటం మంచి శుభదాయకం అని, ప్రధాని మోడీ వచ్చి మంచి సపోర్ట్ ఇచ్చారన్నారు. నూతన రాజధాని నిర్మించటం సాధారణ విషయం కాదన్నారు. ఫైనాన్స్ సెక్టార్ ఉండాలనే ఉద్దేశంతో 15 బ్యాంకుల నిర్మాణ కార్యక్రమం ఉండటం మంచిదని, దేశంలోనే ఇది మొదటిసారి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు నష్టపోకుండా చూసుకుంటాం అని కేంద్ర మంత్రి నిర్మలమ్మ హామీ ఇచ్చారు. అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు నిర్మలా సీతారామన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు.

Also Read: CM Chandrababu: రైతుల సహకారం మరువలేనిది.. అమరావతిని వినూత్నంగా నిర్మిస్తున్నాం!

‘నూతన రాజధాని అమరావతిని మళ్లీ పునఃప్రారంభించటం మంచి శుభదాయకం. ప్రధాని మోడీ వచ్చి మంచి సపోర్ట్ ఇచ్చారు. నూతన రాజధాని నిర్మించటం సాధారణ విషయం కాదు. ఫైనాన్స్ సెక్టార్ ఉండాలనే ఉద్దేశంతో 15 బ్యాంకుల నిర్మాణ కార్యక్రమం ఉండటం మంచిది. దేశంలోనే ఇది మొదటిసారి. ఇలా ఒకే స్ట్రీట్‌లో 15 బ్యాంకులు ఏర్పాటు చేయటం అనేది మాములు విషయం కాదు. హైదరాబాద్లో ఫైనాన్స్ జిల్లా ఏర్పాటులో సీఎం చంద్రబాబు పాత్ర ఏవిధంగా ఉందో.. అలాగే ఇప్పుడు అమరావతిని బ్యాంకుల స్ట్రీట్‌గా మార్చటం మరొకసారి ఒక గొప్ప అవకాశం వచ్చింది. అమరావతి నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం. రైతులకి ఎలాంటి సమస్య లేకుండా బ్యాంకింగ్ సెక్టార్‌ని అందించటం మీ బాధ్యత. మధ్యతరగతి కుటుంబాలకి మంచి పోషకమైన పదార్దాలు అందించాలని ఉంటుంది. కాయగూరలు, పండ్లు ఒక చోటుకి తీసుకొచ్చే విధంగా సీఎం చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలా చేయటంతో ఆంధ్రప్రదేశ్లోని రైతులు నష్టపోకుండా చూసుకోగలుగుతాము. వాటి మార్కెట్ కోసం ఢిల్లీ లాంటి రాష్ట్రాలకి తరలించటంలో కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుంది’ అని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

Exit mobile version