ఏపీలో నైట్‌ కర్ఫ్యూ మళ్లీ పొడిగింపు

Curfew

Curfew

కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన నైట్‌ కర్ఫ్యూను మరోసారి పొడిగించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం… వచ్చే నెల నాలుగో తేదీ (సెప్టెంబర్‌ 4వ) వరకు నైట్‌ కర్ఫ్యూ కొనసాగిస్తున్నట్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.. ఏపీ సర్కార్ ఉత్తర్వుల ప్రకారం.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఏపీలో నైట్‌ కర్ఫ్యూ అమలులో ఉండనుంది… ఆ తర్వాత యథావిథగా అన్ని కార్యక్రమాలకు అనుమతి ఉంటుంది.. అవి కూడా కరోనా నిబంధనలకు లోబడి చేసుకోవాల్సి ఉంటుంది.. మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్‌ వాడడం లాంటి నిబంధనలు యథావిథిగా అమలు ఉండనున్నాయి.. కాగా, ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే.