NTV Telugu Site icon

NIA: దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు

Untitled 3

Untitled 3

NIA: దేశంలో ప్రస్తుతం కేటుగాళ్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. బంగారంగా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తో పాటుగా మానవ అక్రమ రవాణా కి కూడా పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మానవ అక్రమ రవాణా పైన ఎన్ఐఏ అధికారులు ద్రుష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు దేశ వ్యాప్తంగా తనికీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాల్లో న్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అనుమానితుల ఇళ్లలో దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. కాగా తెలంగాణ, తమిళనాడు, కేరళ, త్రిపుర, పుదుచ్చేరిలలో సోదాలు జరుపుతున్నారు . అలానే అస్సోం, బెంగాల్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్‌లలో రాష్ట్రాల్లో కూడా ఎన్‌ఐఏ అధికారులు తనికీలు చేపట్టారు.

Read also:NBK 109: బాలకృష్ణ – బాబీ పని మొదలెట్టేశారు!

మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న కేటుగాళ్ళ గురించి స్పష్టమైన సమాచారం ఎన్ఐఏ అధికారులు దగ్గర ఉంది. ఆ సమాచారం ఆధారంగానే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా తాజాగా విజయవాడలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పిడిఎస్ యూ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ ఉక్కు ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త బందుకు పిలుపునిచ్చిన తరుణంలో విద్యాసంస్థల బంద్ చేయించడానికి వచ్చిన విద్యార్థి సంఘాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ బందుకు పలు పార్టీలు మద్దతు తెలియజేసాయి.