NTV Telugu Site icon

NIA Raids in Guntur and Kurnool: గుంటూరు, కర్నూలులో ముగిసిన NIA సోదాలు

Nia

Nia

దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు, కర్నూలులో NIA అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరులో NIA అధికారుల సోదాలు ముగిశాయి. మొత్తం ఏడు గంటల పాటు సోదాలు చేశాయి NIA బృందాలు…మూడు బృందాలతోపాటు డీఐజీ స్థాయి అధికారి ఈ సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం…PFI, SDPIకి చెందిన ముగ్గురు కీలక అనుమానితులని అదుపులోకి తీసుకున్నాయి ఎన్ఐఏ బృందాలు…మొత్తం ఏడు గంటల పాటు సోదాలు చేయడంతో ఏం జరుగుతుందో తెలీక స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

Read Also: Adani, Reliance Pact: ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద.. ఈ ఇంటి మీది కాకి ఆ ఇంటి మీద వాలటానికి వీల్లేదు

ముఖ్యనేతల కార్యాలయాలు, ఇళ్లపై సోదాలు కొనసాగాయి. గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి అధికారులు సోదాలు నిర్వహించగా… పాత గుంటూరులోని పలు ప్రాంతాలలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. వహీద్, రహీమ్, జఫ్రుల్లా ఖాన్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు NIA అధికారులు. వచ్చేనెల 8న విచారణకు హాజరుకావాలంటూ PFI సభ్యులకు ఎన్.ఐ.ఏ. అధికారులు నోటీసులు జారీచేశారు.

కరాటే శిక్షణ పేరుతో పీఎఫ్‌ఐ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించడంతో పాటు యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు వచ్చిన ఆరోపణలతో ఈ సోదాలు జరిగాయి. గుంటూరుతో పాటు కర్నూలులోని ఖడక్‌పూర్‌ వీధిలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. ఎస్‌డీపీఐ నాయకుడి ఇంట్లో సోదాలు నిర్వహించి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.ఇదిలా వుంటే కర్నూలులో NIA దాడులకు నిరసనగా గాంధీ విగ్రహం ముందు SDPI ఆందోళనకు దిగింది.ఎస్డీ పి ఐ నేతలు అబ్దుల్ వారిస్, ఇంతియాజ్ ఇళ్లలో సోదాలు చేయడంతో ఎన్ ఐ ఏ అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఎన్ ఐ ఏ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏమీ దొరకకపోవడంతో వెనుదిరిగివెళ్లిపోయారు ఎన్ ఐ ఏ అధికారులు. టు టౌన్ పీఎస్ కు చేరుకున్నారు ఎన్ ఐ ఏ అధికారులు.

Read Also: Theft in Bajaj Showroom: ఎలక్ట్రానిక్స్ షోరూంలో దొంగ దర్జా.. తాపీగా లక్షలు దోచుకెళ్ళిన కేటుగాడు