YS Jagan Attack Case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విపక్షనేతగా ఉన్న సమయంలో.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనపై కత్తితో దాడి చేయడం సంచలనంగా మారింది.. అయితే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్‌ఐఏ కోర్టు.. ఇదే సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసుకు బెయిల్ నిరాకరించిన ఎన్ఐఏ కోర్టు… కేసులో బాధితుడి స్టేట్‍మెంట్ రికార్డు చేశామని ఎన్‍ఐఏ న్యాయవాది కోర్టుకు తెలపడంతో.. అసలు రికార్డు చేస్తే చార్జిషీట్‌లో ఎందుకు లేదని ప్రశ్నించారు న్యాయమూర్తి.. బాధితుడిని విచారించకుండా మిగతా సాక్షులను విచారించి ఉపయోగం ఏముందన్న కోర్టు.. ఈ నెల 31వ తేదీ నుంచి విచారణకు షెడ్యూల్ ప్రకటించింది.. కోర్టుకు బాధితుడు సహా మిగిలినవారంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి.
Read Also: Vellampalli Srinivas: పవన్ కల్యాణ్ గ్లాస్ ఎప్పుడో పగిలింది.. పార్టీ మూసుకోండి..
ఇక, ఈ కేసులో శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌ను రద్దు చేసిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.. కాగా, విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై కోడికత్తితో శ్రీనివాస్ దాడి చేశారు. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం శ్రీనివాస్ రిమాండ్‌లో ఉన్నారు. అయితే, బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేశారు.. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు.. ఈ కేసులో బాధితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎందుకు విచారించడంలేదు.. ఆయన్ను విచారించకుండా.. ఈ కేసులో సాక్షులను విచారిస్తే ఉపయోగం ఏముందని ప్రశ్నించింది.. ఇదే సమయంలో స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు ఎన్ఐఏ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దాంతో న్యాయస్థానం కలుగజేసుకుని స్టేట్‌మెంట్ రికార్డు చేస్తే ఛార్జిషీట్‌లో ఎందుకు పేర్కొలేదని ప్రశ్నించడంతో ఈ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నట్టు అయ్యింది. ఇక, తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీన జరగనుండడంతో.. ఏం జరుగుతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.
