విశాఖ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన వివాహిత సాయిప్రియ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తున్నాయి.. మ్యారేజ్ డే రోజే భర్త కళ్లుగప్పి.. మిస్ అయిన ఆమె నెల్లూరులో ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు.. ప్రియుడితో సాయిప్రియ వెళ్లిపోయినట్లు స్పష్టం చేశారు. నెల్లూరుకు చెందిన రవితో కొన్నాళ్లుగా సాయిప్రియ ప్రేమ వ్యవహారం నడుపుతోందని తెలిపారు. పెళ్లి రోజు సందర్భంగా భర్తతో ఆర్కే బీచ్‌కు వెళ్లిన క్రమంలో భర్త మొబైల్ చూస్తున్న సమయంలో సాయిప్రియ లవర్‌తో పారిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు.. అయితే సముద్రంలో గల్లంతైనట్లు భర్త శ్రీనివాస్ భావించి పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆమె కోసం రెండ్రోజులుగా నేవీ హెలికాప్టర్‌తో అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం.. ఇలా ఎంతో హడావిడి జరిగింది.. అయితే, ఇప్పుడు మరోసారి ఝలక్ ఇచ్చింది సాయిప్రియ… విశాఖ ఆర్కే బీచ్‌లో మిస్సైన సాయిప్రియ.. పెళ్లిపీటలపై ప్రత్యక్షమైంది.. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకుంది.. తాళిబొట్టుతో ఉన్న ఫొటోను పేరెంట్స్‌కు పంపింది.. తల్లిదండ్రులకు వాట్సప్ ఆడియో మెస్సేజ్ పెట్టిన ఆమె.. తాను క్షేమంగానే వున్నాను… నాకోసం వెతకవోద్దని సమాచారం ఇచ్చింది. సాయిప్రియ ఆచూకీపై 48 గంటల పాటు ఉత్కంఠ కొనసాగగా.. ఆ మెసేజ్ రావడంతో అనుమానం నిజమైనట్టు చెబుతున్నారు. మొత్తంగా ఉద్దేశ్య పూర్వకంగానే సాయిప్రియ వెళ్లిపోయినట్టు నిర్ధారణకు వచ్చేశారు.
Read Also: Nara Lokesh: జగన్ దోపిడీని దశల వారీగా బయట పెడతాం.. క్లీన్ బౌల్డ్ తప్పదు..!
కాగా, సాయిప్రియకు శ్రీనివాస్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్‌ఏడీ వద్ద ఓ కాలేజీలో సాయిప్రియ డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈనెల 25న తమ పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాస్, ఆయన భార్య సాయిప్రియ కలిసి విశాఖలోని ఆర్కే బీచ్ కు వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు బీచ్ ఒడ్డున భార్యాభర్తలు కలిసి ఉన్నారు. అయితే సాయి ప్రియ భర్తకు ఫోన్ లో మెసేజ్ రావడంతో ఒడ్డు నుంచి వెనక్కి వచ్చి మెసేజ్ చూసుకుని తిరిగి చూసేసరికి సాయి ప్రియ కనబడలేదు. దీంతో తన భార్య సముద్రంలోని కొట్టుకుపోయిందని భావించిన ఆమె భర్త శ్రీనివాస్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఆరోజే గత ఈతగాళ్ల సాయంతో బీచ్‌లో గాలించగా ఆచూకీ లభ్యం కాలేదు. ఇక, ఆ తర్వాత నేవీ హెలికాప్టర్ కూడా రంగంలోకి దిగింది.. కానీ, సాయిప్రియ మాత్రం.. నెల్లూరులో సేఫ్‌గానే ఉంది.. ఇక, ఇప్పుడు నెల్లూరు నుంచి బెంగళూరుకు మకాం మార్చినట్టు తెలుస్తోంది.
