Prakasam Barrage: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ ఆరవ రోజు కొనసాగుతుంది. డబుల్ ఐరన్ రోప్ పను డోజర్ కు కనెక్ట్ చేసి బోట్లను లాగే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న లోడ్ హెవీ కావడంతో లోడ్ యాక్సిల్ విరిగిపోయింది. ఇవాళ సరాసరి భూమిలోకి వేసిన స్తంభానికి కనెక్ట్ చేసి డోజర్ తో లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు బోట్ల తొలగింపులో ఒక సక్సెస్ సాధించాలని ఇంజనీర్లు, డైవింగ్ టీం, కచ్చులూరు టీం ఆశిస్తున్నారు. డబుల్ రోప్ తో పాటుగా కార్గో బోట్లను రప్పించి వాటికి డబుల్ రోప్ ను కనెక్ట్ చేసి బయటకి లాగే ప్రయత్నం కొనసాగుతుంది.
Read Also: Delhi : ‘నవంబర్‌లోనే ఢిల్లీ ఎన్నికలు నిర్వహించండి’.. ఈసీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి
కాగా, ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపుకు వినూత్న ఇంజనీరింగ్ విధానం ఉపయోగిస్తున్నారు. H మోడల్ లో భారీ వెయిట్ లిఫ్టింగ్ బ్లాక్ ను బెకెమ్ ఇంజనీర్లు సిద్ధం చేస్తున్నారు. బోట్లను బయటకు తీయడానికి ఇదే చివరి ప్రయత్నంగా చెప్తున్నారు. మునిగిన పడవల అడుగుకు ఈ నిర్మాణాన్ని పంపి నీటిపై తేలేలా చేసేందుకు యత్నిస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి సిద్ధం కానున్న నిర్మాణం.. బోట్ల తొలగింపులో ఈ పద్ధతిని వినియోగిస్తున్నారు. ఈ పద్ధతిలో రోజుకో బోటు ఒడ్డుకు తీసుకురానున్న ఇంజనీర్లు.. 6 టన్నుల బ్లాక్లు, H బ్లాక్కు మధ్యలో ఒక చిన్న బ్లాక్ కలిపి తయారీ చేయనున్నారు.