Minister Anagani: మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం కారణంగా ఇవాళ విడుదల చేయాల్సిన కొత్త పాస్‌బుక్‌ల ఆవిష్కరణ వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. వారం లేదా 10 రోజుల లోపులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పాస్‌బుక్‌లను ఆవిష్కరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఆగస్టు 29, 30 తేదీలతో పాటు సెప్టెంబర్ 2వ తేదీన GOM (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనుందని వెల్లడించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను స్వీకరించి, సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందిస్తామని మంత్రి అనగాని అన్నారు.
Read Also: Saliya Saman: మ్యాచ్ ఫిక్సింగ్ యత్నం.. శ్రీలంక క్రికెటర్‌పై ఐసీసీ ఫైర్.. ఏకంగా ఐదేళ్లు!
అలాగే, విశాఖపట్నంలో సైనిక ఉద్యోగుల భూములపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు రాసిన లేఖ ఆధారంగా ప్రస్తుతం విచారణ జరుగుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాల నేపథ్యంలో వచ్చిన కొన్ని ఆరోపణలను కూడా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఇక, రెవెన్యూ శాఖ పూర్తి పారదర్శకంగా పని చేస్తోందని స్పష్టం చేశారు. అన్ని వ్యవహారాలు చట్టబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్నాయని ఆయన ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
