Minister Anagani: మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం కారణంగా ఇవాళ విడుదల చేయాల్సిన కొత్త పాస్‌బుక్‌ల ఆవిష్కరణ వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. వారం లేదా 10 రోజుల లోపులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పాస్‌బుక్‌లను ఆవిష్కరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.