NTV Telugu Site icon

Somireddy: మంచి నాయకులు ఎమ్మెల్సీలుగా కౌన్సిల్కి వస్తున్నారు..

Somireddy

Somireddy

Somireddy: ఎన్డీయే కూటమి అభ్యర్థులుగా బీదా రవి చంద్ర, కావాలి గ్రీష్మ, బీటీ నాయుడు, నాగబాబు, సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బీదా రవి చంద్ర జిల్లా పార్టీ అధ్యక్షులుగా పని చేశారు.. బీదా మస్తాన్ రావు కూడా రాజ్యసభ సభ్యుడిగా చేశారు.. ఒక కార్యకర్తగా అద్భుతంగా పార్టీ కోసం పని చేసిన వ్యక్తి బీదా రవిచంద్ర.. మంచి నాయకులు ఎమ్మెల్సీలుగా కౌన్సిల్ కి వస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. తప్పకుండా ఇన్ని రోజులుగా కౌన్సిల్లో మిడిసిపడిన వైసీపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్సీలు మంచి కౌంటర్ ఇస్తారు అని చెప్పారు. అన్ని వర్గాలకు ఎమ్మెల్సీలు ద్వారా న్యాయం చేశామని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Read Also: CM Revanth Reddy : చేసిన తప్పులు, అప్పులను ఎన్ని రోజులు కప్పిపుచ్చుతారు

ఇక, శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు చెప్పారు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీదా రవిచంద్ర. సాధారణ కార్యకర్తగా మండల నాయకుడిగా నా ప్రస్థానం మొదలైంది.. వివిధ స్థానాల్లో పని చేసే అవకాశం టీడీపీ న్యాయకత్వం కల్పించింది.. శాసన మండలికి అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉంది.. తెలుగు దేశం పార్టీ ఎప్పుడు బడుగు బలహీనర్గాలకు అవకాశాలు ఎప్పుడు కల్పిస్తూనే ఉంటారు.. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన నాకు మంచి అవకాశం కల్పించారు.. రాయలసీమ నుంచి అత్యధిక సీట్లు రావాలని అందరం కష్ట పడ్డాము.. జోన్ 5 కో ఆర్డినేటర్ గా పని చెయ్యడం మంచి అనుభూతి ఇచ్చింది అని బీదా రవిచంద్రా తెలిపారు.

Read Also: CM Yogi: యూపీ రైతులకు సీఎం శుభవార్త.. గోధుమ మద్దతు ధర పెంపు

అలాగే, చంద్రబాబు, నారా లోకేష్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను అని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కావలి గ్రీష్మ తెలిపారు. నిండు గర్భిణి అయినటువంటి నాకు ఇలాంటి అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. కొంచెం ఎమోషనల్ గా ఉన్నాను.. దళిత జాతిని అవమానించే విధంగా వైసీపీ ప్రవర్తిస్తుంది.. వైసీపీలో ఇంకా మార్పు రాలేదు అని మండిపడింది. వైసీపీలో దళితులను భ్రష్టు పెట్టే విధానం అలాగే ఉంది.. డిబెట్ లో మాట్లాడిన సమయంలో నిన్ను ఎవరైనా రేప్ చేశారా అని అడిగారు.. నేను కనీసం ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు ఫైల్ చెయ్యలేదు అని పేర్కొనింది. అలాంటి సమయంలోనే బస్ లో నుంచి ఈడ్చి తంతాను అని వ్యాఖ్యానించాను.. దళితులను ఇబ్బంది పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. అందుకే వారికి 11 సీట్లు వచ్చాయని చెప్పుకొచ్చింది. ఇక, బీటీ నాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన సిఎం చంద్రబాబు, లోకేష్ కి ధన్యవాదాలు.. మాకు గాడ్ ఫాదర్లు లేరు.. డబ్బులు లేవు అని తెలిపారు.