Site icon NTV Telugu

కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ నారాయణరావు

మంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ నారాయణ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో మీడియాతో మాట్లాడిన వారు మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. కొడాలినాని నిర్వహిస్తున్న జూద క్రీడలు బయటపడతాయన్న భయంతోనే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు ప్రత్నిస్తున్నారని నారాయణరావు అన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి సమావేశాలు నిర్వహించని మంత్రి నాని, నేడు కే కన్వెన్షన్ లో ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించడం, అతని భయాన్ని తెలియజేస్తుందని నారాయణరావు అభిప్రాయపడ్డారు.

Read Also: ఎన్జీవో హోంలో ఏపీ ఉద్యోగ సంఘాల నేతల భేటీ

క్యాసినో మంత్రిగా నాని: కొల్లురవీంద్ర
టీడీపీలో క్రమశిక్షణతో ఉన్న మంత్రి కొడాలి నాని, వైసీపీలోకి వెళ్లిన తర్వాతే బూతుల మంత్రి, పేకాట మంత్రిగా బాగా పేరుగడించారని కొల్లు రవీంద్ర అన్నారు.ఆదిలోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి ఉంటే పరిస్థితి ఇప్పుడు ఇంతవరకు వచ్చేది కాదన్నారు. ప్రస్తుతం క్యాసినో మంత్రిగా పేరు గడించిన నాని అరాచకం భవిష్యత్తులో ఏ స్థాయికి చేరుకుంటుందో ఊహించడమే కష్టంగా ఉందని కొల్లు రవీంద్ర అన్నారు.

Exit mobile version