పెట్రోల్, డీజిల్ పై బాదుడు ఆపేది ఎప్పుడు? : జగన్‌పై లోకేష్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి : పెట్రోల్ ధరలపై తగ్గించకపోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. వసూల్ రెడ్డి గారు నిద్రలేచేది ఎప్పుడు? పెట్రోల్, డీజిల్ పై బాదుడు ఆపేది ఎప్పుడు? అంటూ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి సామాన్యులపై భారాన్ని తగ్గించడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై రూ.12 తగ్గించాయని… అస్సోం, గోవా, త్రిపుర, మణిపూర్, కర్ణాటక ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై రూ.7 తగ్గించాయన్నారు.
ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్ పై రూ.6.07 , డీజిల్ పై రూ.11.75 తగ్గించిందని… గుజరాత్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించడానికి నిర్ణయించిందని ఫైర్ అయ్యారు. కేంద్రం, ఇతర రాష్ట్రాలన్నీ తగ్గించినా వసూల్ రెడ్డి గారికి మాత్రం పెట్రోల్, డీజిల్ పై పన్నుల భారం తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి మనస్సు రావడం లేదని తెలిపారు. నిత్యావసరాలు, కరెంట్, ఆస్తిపన్ను, చివరికి చెత్తపైనా పన్నులేసిన మీ బాదుడుకి జనజీవితాలు అగమ్యగోచరమయ్యాయని ఫైర్ అయ్యారు. దేశమంతా పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గిస్తున్న నేపథ్యంలో జనంపై వసూల్ రెడ్డి కరుణ చూపాలని కోరుతున్నానని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?