టీడీపీ మహానాడుకి జనం పోటెత్తారు. ప్రకాశం వేదికగా సైకిల్ పార్టీ గుబాళించింది. మహానాడు2022 సందర్భంగా నారా లోకేష్ మీడియాతో ముచ్చటించారు. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ తన పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేశారు. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు.. ప్రజలను హింసించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ కేడరునే హింసిస్తోందన్నారు.
ఓ ఎమ్మెల్సీ తన డ్రైవర్, పార్టీ కార్యకర్తనే చంపేస్తే.. మరో ఎమ్మెల్యే తన పార్టీ గ్రామ స్థాయి నేతను హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ కేడరే ఆ పార్టీ నేతలపై తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. పార్టీ ఆదేశిస్తే.. పాదయాత్రే కాదు.. ఎలాంటి పోరాటానికైనా సిద్దంగా ఉన్నానన్నారు. ప్రజల్లోకి వెళ్తాను.. గ్రామ గ్రామానికి వెళ్తానన్నారు.
పొత్తులనేవి ఎన్నికలప్పుడు జరిగే చర్చ. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం చేపడుతోన్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ప్రజలను చైతన్యం చేస్తున్నాం. ప్రజలంతా కలిసి ప్రజా కంటక ప్రభుత్వాన్ని దింపాలనే భావనతోనే అందరూ కలవాలని పవన్, చంద్రబాబు వ్యాఖ్యనించారని భావిస్తున్నా అన్నారు. మహానాడు అయ్యాక జగన్ చేసిన రెండు భారీ కుంభకోణాలను బయట పెడతానన్నారు లోకేష్.
ఆ కుంభకోణాలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయి. అన్ని బయటపెడతాను.. జగన్ నైజం ప్రజలకు వివరిస్తా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్దమేనన్నారు లోకేష్. మహానాడుకు స్పందన పీక్స్ లో ఉంది.అదానీ, అరబిందో, గ్రీన్కో సంస్థలతో ఒప్పందానికి దావోస్ వెళ్లాలా..? తాడేపల్లి కొంపకు పిలిస్తే వాళ్లే వస్తారు.అదానీ, గ్రీన్కోలను గతంలో వెళ్లగొట్టారు.. మళ్లీ వాళ్లతో సెటిల్ చేసుకున్నాక ఒప్పందాలు కుదిరాయి.యువత అంటే వారసులు మాత్రమే కాదు.. పార్టీ కోసం పని చేసిన చాలా మంది యువకులున్నారు.40 శాతం సీట్ల కేటాయింపుల్లో వారసులతో పాటు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని యువత కూడా ఉంటారన్నారు.
Kishan Reddy కుటుంబపార్టీలకు, పాలనకు బీజేపీ వ్యతిరేకం