NTV Telugu Site icon

Nara Lokesh: పవర్ హాలిడే ఎత్తేయాలని జగన్‌ కి లేఖ

Lokeshbew

Lokeshbew

ఏపీలో విద్యుత్ కోతలు, పవర్ హాలిడే అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. పవర్ హాలిడే ఎత్తేయాలని లోకేష్ కోరారు. ప‌వ‌ర్‌లో వున్న మీరు ప‌వ‌ర్ హాలీడే ప్రకటించ‌డం చాలా సులువే. కానీ ఆ ప్రకటన చేసే ముందు కనీసం ఒక్క క్షణం రాష్ట్ర ప‌రిస్థితి ‎ఆలోచించారా?

మొన్నటి వరకు కరోనా కష్టాలతో నష్టాల్లో నడిచిన పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కాస్త గాడినపడి పుంజుకుంటుంటే పవర్ హాలిడే అంటున్నారు.ఈ సమయంలో పవర్ హాలిడే పాటించాలన్న ఆదేశాల‌తో అన్ని రంగాలు సంక్షోభంలోకి వెళ్లాయి. ప్రతిపక్ష నేత‌గా వున్నపుడు కనీసం క‌రెంటు చార్జీలు ఒక్కసారి కూడా పెంచ‌ని టీడీపీ ప్రభుత్వంపై.. ఎంతెంత బిల్లులు వేస్తారంటూ అవాస్తవాలు ప్రచారం చేశారు.అధికారంలోకి వ‌చ్చిన 3 ఏళ్లలోనే 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజలకు షాక్ ‎ఇచ్చింది.

Read Also: Somu Veerraju: ఉత్తరాంధ్ర నీటిప్రాజెక్టులపై జగన్‌ కి లేఖ

5 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏనాడు కరెంట్ కోతలు లేవు.కానీ వైసీపీ వచ్చాక.. విద్యుత్ రంగాన్ని నాశనం చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు.ప‌రిశ్రమల్లో ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు ఇవ్వలేని ప‌రిస్థితి నెల‌కొంది.ఓ వైపు క‌రెంటు కోతలు, మ‌రోవైపు ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఏపీలో అధికంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు వల్ల ‎జ‌న‌రేట‌ర్లు న‌డ‌ప‌లేక కుటీర‌, చిన్న ప‌రిశ్రమల నుంచీ పెద్ద ప‌రిశ్రమ‌ల వ‌ర‌కూ అన్నీ మూత దిశ‌గా సాగుతున్నాయన్నారు లేఖలో లోకేష్.

Show comments