Site icon NTV Telugu

Nara Lokesh : అల్లూరి విగ్రహావిష్కరణపై ఆసక్తికర వ్యాఖ్యలు..

Nara Lokesh Pm Modi

Nara Lokesh Pm Modi

Nara Lokesh interesting Comments on Alluri Sitaram Raju Statue.

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి నేడు. అయితే ఈ నేపథ్యంలోనే ఏపీలోని భీమవరంలో 30 అడుగుల సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని నేడు ప్రధాని మోడీ ఆవిష్కరించనున్న క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌ వేదికగా.. ‘అమాయక గిరిజనం నిరంకుశ పాలకుల చేతుల్లో నలిగిపోతుంటే వారిలో ధైర్యం నింపి నిప్పు కణాల్లా మార్చిన ఉత్తేజం అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్ర పోరులో ధృవతారలా మెరిసి బ్రిటిష్‌వారి గుండెల్లో దడపుట్టించిన మన్యంవీరుడు అల్లూరిని ఆజాది కా అమృత మహోత్సవ్ లో భాగంగా స్మరించుకోవడం మనకు గర్వకారణం. అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని చేతుల మీదుగా అల్లూరి విగ్రహావిష్కరణ జరగడం ఒక తెలుగువాడిగా సంతోషంగా ఉంది. అల్లూరి జయంతి సందర్భంగా ఆ విప్లవజ్యోతి సాహస చరిత్రను స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం.’ అని నారా లోకేష్‌ పోస్ట్‌ చేశారు. అయితే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌తో పాటు గవర్నర్‌ బిష్వభూషన్‌ హరిచందన్‌ పాల్గొననున్నారు. అయితే భీమవరంలో ప్రధాని మోడీ నేపథ్యంలో ఇప్పటికే భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.

 

Exit mobile version