ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఉద్వేగభరితంగా ప్రసంగించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైఎస్సార్సీపీ అంటే యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు రాముడు.. జగన్ రాక్షసుడు. టీడీపీ స్థాపించిన 40 ఏళ్ల చరిత్రలో ఈ రోజు ప్రత్యేక స్థానం. పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయి.. ఎవ్వరూ ఏం చేయలేరు. టీడీపీని ఏదో చేద్దామనుకున్న వాళ్లు గాల్లో కొట్టుకుపోయారు.
టీడీపీ కార్యకర్తల శరీరం కొస్తే పసుపు రక్తం వస్తుంది. వైసీపీ నేతలు చంపే ముందు జై జగన్ అనమన్నా.. జై తెలుగుదేశం అనే కార్యకర్తలున్న పార్టీ టీడీపీ. శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే పార్టీ వైసీపీ. కోడి కత్తి.. వైఎస్ వివేకా హత్యలో జగన్ డ్రామాలాడాడు. ఒక్క ఛాన్స్ అంటూ సీఎం అయ్యారు. కన్నతల్లి, సొంత చెల్లెలను కూడా జగన్ ఇబ్బందులు పెడుతున్నాడన్నారు లోకేష్.
లోకేష్ ప్రసంగానికి ఆటంకం కలిగింది. బహిరంగ సభలో కంట్రోల్ టీడీపీ కార్యకర్తలు అదుపుతప్పారు. ఏసీ మిషన్ల మీద కూర్చున్నారు పార్టీ కార్యకర్తలు. దయచేసి ఏసీ మిషన్ల నుంచి దిగాలంటూ అచ్చెన్న కోరారు. కార్యకర్తలని కంట్రోల్లో పెట్టే బాధ్యతలని తీసుకున్నారు చంద్రబాబు. క్రమశిక్షణ లేకుంటే ఇబ్బంది పడతామని.. సభకు అంతరాయం కలుగుతుందన్న చంద్రబాబు. ప్రభుత్వంపై యుద్దం ప్రారంభమైందన్న చంద్రబాబు. దయచేసి ప్రతి కార్యకర్త అర్థం చేసుకోవాలని చంద్రబాబు రిక్వెస్ట్ చేశారు.
స్టేజ్ మీద నేతలను కంట్రోల్ చేసిన చంద్రబాబు. నేతలు బాధ్యతతో ఉండాలన్న చంద్రబాబు. గొంతు సహకరించకపోవడంతో ప్రసంగాన్ని మధ్యలో ఆపేసిన లోకేష్. లోకేష్ చెప్పిన మాటలను తాను చెబుతానన్న కేశవ్. అణిచివేత ఎక్కువైతే తిరుగుబాటు మొదలవుతుందని లోకేష్ అన్నారన్న పయ్యావుల. ఇప్పుడు ఆ తిరుగుబాటు ఆసన్నమైందని లోకేష్ స్పష్టం చేశారన్నారు పయ్యావుల కేశవ్.
NBK108: బాలయ్య కోసం రంగంలోకి ఆ హీరోయిన్..?