పూర్వం రాజులు, చక్రవర్తులు ప్రజలకు కానుకలుగా, ఇనాములుగా.. భూములు, దేవాలయ భూములు దానం చేయడం తెలుసు. ఎందరో జమీందార్లు, సంస్థానాధీశులు కూడా ప్రజలకు భూరి విరాళాలు అందించడం చూశాం. వర్తమాన భారతంలో ప్రభుత్వాలు ప్రజల డబ్బులతోనే పేదలకు ఇళ్లు కట్టించడం చూశాం. కానీ ఓ ప్రజానాయకుడు తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఏకంగా సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం ఇస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇలా సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం ఇస్తానన్న ఆ రాజకీయ నాయకుడు ఎవరు.. డబ్బు సంపాదనే లక్ష్యంగా రాజకీయాలకు వచ్చే ఈ కాలంలో తాను కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయలను ప్రజల కోసం ఖర్చుపెడుతూ రాజకీయాల్లో సరికొత్త ఒరవడిని నెలకొల్పుతున్న ఆ ఆదర్శనాయకుడు ఎవరు..?
ఆయన నిజాయితీకి నిలువెత్తురూపం.. మానవత్వానికి మరో రూపం… ప్రజల సంక్షేమమే ఆయన మాట.. అభివృద్ధే ఆయన బాట.. ఆయన మాట కరుకు మనసు మాత్రం వెన్న.. అన్నా అంటూ సాయం కోరి ఎవరైనా వస్తే నేనున్నా అంటూ అండగా నిలుస్తారని ప్రజలు చెబుతుంటారు. ప్రతి నిత్యం నా ప్రజలు బాగుండాలి.. వారి సంతోషంలో భాగం కావాలి అంటూ పరితపించే నిస్వార్థ ప్రజా సేవకుడు ఆయన. తనకు రాజకీయ జన్మనిచ్చిన నియోజకవర్గ ప్రజలను కన్నబిడ్డల్లా భావిస్తూ.. ఎవరికీ ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ, ప్రజల కోసం సొంతంగా కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతూ.. గెలుపు ఓటములకు అతీతంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నిఖార్సైన నాయకుడు. ఓ వైపు తనను నమ్ముకున్న ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ.. మరోవైపు నంద్యాల జిల్లా రాజకీయాలపై బలమైన ముద్ర వేస్తున్న ది మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ పీపుల్స్ లీడర్.. బనగానపల్లె నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి.
Kalyandurg: కళ్యాణదుర్గం టీడీపీలో వర్గ విభేదాలు..! ఇప్పుడు ఫ్లెక్సీ వార్..
2 దశాబ్దాలుగా బనగానపల్లె నియోజకవర్గం ప్రజల సేవకు టీడీపీ అంకితమైన కుటుంబం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి కుటుంబం. గతంలో బీసీ జనార్థన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి సర్పంచ్‌గా బనగానపల్లె పట్టణ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించారు. వ్యాపార వేత్తంగా పేరుగాంచిన బీసీ జనార్థన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే కరువు ప్రాంతమైన బనగానపల్లెలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టి పేదలను ఆదుకున్నారు. 2014 లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన తొలిసారే సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని ఓడించి, సంచలనం సృష్టించిన బీసీ జనార్థన్ రెడ్డి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకో లేదు. నిత్యం కరువుకాటకాలతో దుర్భిక్షం తాండవించే బనగానపల్లె నియోజకవర్గంలో అన్నదాతల దుస్థితిని గమనించిన చలించిపోయిన బీసీ జనార్థన్ రెడ్డి దద్దనాల ప్రాజెక్టుకు రూపకల్పన చేసారు. ఎస్ఆక్‌బీసీ వద్ద 3 పంపుహౌస్‌లు ఏర్పాటు చేసి నీటిని తరిలించి దద్దనాల ప్రాజెక్టును నింపి, పడమటి పల్లెలను సస్యశ్యామలం చేసిన అపరభగీరథుడిగా నిలిచిపోయారు. బీసీ జనార్థన్ రెడ్డి కృషితో బనగానపల్లె నియోజకవర్గంలో రైతన్నలు ఏటా రెండుకార్ల పంటలు పండించుకునేవారు. ఇక బనగానపల్లె ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్న పరిస్థితిని గమనించిన బీసీ.. సొంత డబ్బులతో నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 60 మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించారు.
ఐదేళ్ల పాలనా కాలంలో రూ. 1600 కోట్లతో నియోజకవర్గంలో నియోజకర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఊరూరా బీటీ రోడ్లు, వీధివీధినా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పాఠశాలలలో మెరుగైన వసతులు, ఇలా పలు మౌలిక సదుపాయాలు కల్పించారు. బనగానపల్లె నియోజకవర్గంలో ఇప్పటికీ ఏ ఊరు వెళ్లినా బీసీ అభివృద్ధి జాడలే కనిపిస్తాయి. ఇక సొంత డబ్బులతో దేవాలయాల్లో మెట్లు, సైకప్పుల నిర్మాణం నుంచి ఎన్నో సదుపాయాలు కల్పించారు. ముస్లింలు అధికంగా ఉండే బనగానపల్లెలో పలు దర్గాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇటు హిందువుల పండుగలకు, అటు ముస్లింల ఉర్సులకు సొంత నిధులు ఖర్చుపెడుతూ మతసామరస్యానికి ప్రతీకగా బనగానపల్లెను నిలబెట్టిన లౌకికవాది బీసీ జనార్థన్ రెడ్డి. అయితే గత ఎన్నికల్లో కొన్ని స్వార్థ రాజకీయ శక్తులు ఏకమై కుట్రలు పన్నడంతో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. కానీ ఆయనకు బనగానపల్లె ప్రజలపై ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు.. ఇప్పటికీ సొంతంగా కోట్లాది రూపాయలతో నియోజకవర్గ ప్రజల కోసం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
Kunamneni Sambasiva Rao: కాళేశ్వరం ఎలా కుంగిపోయిందో.. బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి అంతే!
ప్రజల కోసం ఎన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నా ఆయన సంతృప్తి చెందడం లేదు.. ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని భావించారు. అందుకే తమకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన బనగానపల్లె ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో సహధర్మచారిణి బీసీ ఇందిర రెడ్డితో కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవగానే.. కొత్త ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా తన ఆస్తులు అమ్మి అయినా.. తన సొంత డబ్బులతో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 2 సెంట్ల స్థలం ఇస్తానని బీసీ జనార్థన్ రెడ్డి ప్రజల సాక్షిగా చేసిన ప్రకటన నంద్యాల జిల్లాలో సంచలనం రేపుతోంది. బీసీ జనార్థన్ రెడ్డి అడుగుజాడల్లో బనగానపల్లె ప్రజల సేవలో భాగమైన ఆయన సతీమణి…బీసీ ఇందిర రెడ్డి కూడా తన పేరిట ఉన్న సొంత ఆస్తులు రూ. 60 కోట్లు పేదల ఇళ్ల స్థలాల కోసం ఇస్తానని ముందుకు వచ్చి ఆదర్శవంతంగా నిలిచారు. బీసీ జనార్థన్ రెడ్డి బాటలో సమ కాలీన రాజకీయ నాయకులు నడిస్తే, ప్రతి పేదవాడిని ధనవంతుడిని చేయాలన్న తెలుగుదేశం పార్టీ ఆరు గ్యారంటీ హామీల్లో ఒకటైన పూర్ టు రిచ్ లక్ష్యం కూడా నెరవేరుతుందంటే అతిశయోక్తి కాదు. బీసీ జనార్థన్ రెడ్డి మాట ఇచ్చారంటే తప్పరని, అది ఎంత కష్టమైనా, ఎన్ని కోట్లు ఖర్చు అయినా చేసి తీరుతారని బనగానపల్లె ప్రజల నమ్మకం. కాగా తాము అధికారంలోకి రాగానే పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పిమాట తప్పి, మడమ తిప్పి నవమోసాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకులు ఉన్న కాలంలో గెలుపు ఓటములకు అతీతంగా సొంత డబ్బులతో పేదలకు 2 సెంట్లు స్థలం ఇస్తానని చేసిన ప్రకటనతో బీసీ జనార్థన్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో సరికొత్త ఒరవడిన సృష్టించారు. మొత్తంగా బీసీ జనార్థన్ రెడ్డి ఆశయం మున్ముందు రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.