Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Srisailam Ugadi Mahotsavam 2026 5 Day Grand Celebrations From March 16 To 20

Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

Published Date :March 2, 2026 , 9:54 pm
By Sudhakar Ravula
Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ugadi Mahotsavam 2026: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) ఎస్. శ్రీనివాసరావు వెల్లడించారు. ఉత్సవ ఏర్పాట్లపై ఆయన అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

పది రోజుల పాటు స్పర్శ దర్శనం
ఉగాది పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. సాధారణంగా ఉత్సవ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది. కాబట్టి, భక్తుల కోరిక మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు (మొత్తం 10 రోజులు) స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు.

Also Read

  • Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
  • Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
  • Nandyala: వివాహ బంధానికి మాయని మచ్చ.. ప్రియుడి మోజులో పడి ఇల్లాలు ఎంత పని చేసిందంటే..!
  • Wife Kills Husband: ప్రియుడి కోసం మెడకు బెల్ట్ బిగించి, బండరాళ్లతో తలపై దాడి చేసి భర్తను హతమార్చిన భార్య..!

తరలిరానున్న కన్నడ భక్తులు
ఉగాదికి వారం రోజుల ముందు నుంచే కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు కాలినడకన క్షేత్రానికి చేరుకుంటారు. కన్నడ భక్తులు భ్రమరాంబా దేవిని తమ ఆడపడుచుగా భావించి చీర, సారె సమర్పించడం ఇక్కడి ఆచారం. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అటవీ ప్రాంతంలోని పాదయాత్ర మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ ప్రాంతం మరియు క్యూ లైన్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా మంచినీటి సరఫరాను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అన్ని విభాగాల ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి, భక్తులకు మెరుగైన సేవలందించాలని స్పష్టం చేశారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలనుకునే భక్తులు, ఈ 10 రోజుల స్పర్శ దర్శన అవకాశాన్ని వినియోగించుకోవాలని దేవస్థానం కోరింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mallikarjuna Swamy Temple.
  • Nandyal News
  • Sparsha Darshanam dates
  • Srisailam EO Srinivasa Rao
  • Srisailam Ugadi 2026

తాజావార్తలు

  • IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్‌కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?

  • Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన ‘సూసైడ్ లేటర్’.. ప్రపంచ కుబేరులకు దడ!

  • TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..

  • Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..

  • Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions