NTV Telugu Site icon

Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌కు భారీ వరద.. కాసేపట్లో గేట్లు ఎత్తనున్న అధికారులు..

Srisailam Dam

Srisailam Dam

Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది.. దీంతో.. మరోసారి గేట్లు తెరిచేందుకు సిద్ధం అవుతున్నారు ఇరిగేషన్‌ శాఖ అధికారులు.. కాసేపట్లో రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయబోతున్నారు.. అయితే, ఇన్ ఫ్లో రూపంలో 2,13,624 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్‌లో వచ్చి చేరుతుంది.. అయితే, కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండడంతో.. ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో రూపంలో 68,876 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది.. ఇక, శ్రీశైలం డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 215.8070 టీఎంసీలుగా ఉంది..

Read Also: Para Olympics 2024: నేటి నుంచి పారాలింపిక్స్‌.. భారత్ తరపున బరిలోకి 84 మంది అథ్లెట్లు

మరోవైపు.. శ్రీశైలం డ్యామ్‌ దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది.. 2 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 30,026 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 78,854 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 78,854 క్యూసెక్కులుగా ఉంది.. ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరింది.. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 312.0450 టీఎంసీలుగా ఉండగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 .0450 టీఎంసీలు.. అయితే, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులోని 2 గేట్లను ఎత్తి నిన్నటి నుంచే దిగువకు నీటిని వదులుతున్నారు అధికారు.. శ్రీశైలంలో కాసేపట్లో మళ్లీ గేట్స్ ఓపెన్ చేయబోతున్న నేపథ్యంలో.. ఇన్‌ఫ్లో పెరిగితే.. నాగార్జున సాగర్‌ లో మరికొన్ని గేట్లు ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు.