Mother K*lls Son: భూ వివాదంలో కన్న కొడుకు ప్రాణాలనే తీసింది ఓ తల్లి.. తరచూ పొలం విషయంలో గొడవ జరగడం.. తాజాగా మరోసారి కూడా అదే ఘర్షణ జరగడంతో.. కొడుకునే తల్లి దారుణంగా హత్య చేసిందని మృతుడి భార్య ఆరోపిస్తోంది.. మొత్తంగా నంద్యాల జిల్లా పొలం వివాదంలో తల్లి ఏకంగా కన్నా కొడుకునే హత్య చేసింది. వెలుగోడు మండలం మోతుకూరులో సుధాకర్ అనే 36 ఏళ్ల కొడుకును తల్లి శివమ్మ హత్య చేసింది. పొలం పంపకాల్లో తల్లి, కొడుకుల మధ్య వివాదం కొనసాగుతోంది.. సుధాకర్, భార్య జ్యోతి ఒక ఇంట్లో నివాసం ఉంటుండగా.. సుధాకర్ తల్లి వెంకట శివమ్మ, రెండవ కుమారుడితో వేరుగా కాపురముంది.
Read Also: Adhira : అధీర నుండి.. అగ్నిపర్వతాల మధ్య ఎస్. జె. సూర్య పోస్టర్ రిలీజ్..
అయితే, కొంత కాలంగా పొలంలో ఆడపడుచులకు కూడా వాటా ఇవ్వాలని తల్లి, ఆడపడుచులు, సుధాకర్ ఘర్షణ పడుతున్నారు. అయితే, మరోసారి తల్లి శివమ్మతో పొలం పంచాలంటూ మరోమారు ఘర్షణకు దిగాడు సుధాకర్.. ఈ ఘర్షణలో సుధాకర్ మృతి చెందాడు. అయితే, తన భర్త సుధాకర్ కంట్లో కారం చల్లి , కట్టుకున్న చీరతోనే తన అత్త వెంకట శివమ్మ, ఆడపడుచులు కలిసి ఉరి వేసి చంపారని మృతుడి భార్య జ్యోతి ఆరోపిస్తుంది. ఈ వ్యవహారంపై సుధాకర్ భార్య జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తోపులాటలో సుధాకర్ కిందపడి చనిపోయాడని తల్లి శివమ్మ వాదిస్తోంది.. తన కన్న కొడుకును తానే ఎందుకు చంపుకుంటానని ఆవేదన వ్యక్తం చేస్తోంది శివమ్మ..
