Site icon NTV Telugu

Minister Payyavula: చంద్రబాబు చేసిన అభివృద్ధిలో ఒక శాతం కూడా జగన్ చేయలేదు

Payyavula

Payyavula

Minister Payyavula: పలేగాళ్ల రాజ్యం గురించి విన్నాం.. కప్పం గట్టమని పొలంలో పంటలు కోసుకుపోయారు.. పాలేగాళ్ల వంశానికి చెందినవాడు జగన్ అని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. పాలేగాళ్ల రాజ్యం తిరిగి తీసుకురావాలని జగన్ చూస్తున్నారు.. చంద్రబాబు 100 రోజుల్లో 6 పంపుల నుంచి 12 పంపుల ద్వారా నీరు విడిచే విధంగా పనులు చేశారు.. చంద్రబాబు ఎగిరిపోతాడు అని అంటున్నారు.. చంద్రబాబు ఎదిగిపోతున్న నాయకుడు, జగన్ దిగజారి పోతున్న నాయకుడు అని ఫైర్ అయ్యారు. రప్పా రప్పా నరుకుతానంటే పాలేగాళ్ల సంస్కృతి కనిపిస్తుందన్నారు. జగన్ హయాంలో గంపెడు మట్టి తీయలేదు.. రాయలసీమకు జగన్ ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా కాలువ గట్టుపై చర్చకు సిద్ధమా అని మంత్రి పయ్యావుల అడిగారు.

Read Also: Bihar: ఎన్నికల ముందు మరొక హత్య.. ఆస్పత్రిలో పేషెంట్ కాల్చివేత

ఇక, 2019లో ఫినిష్ చేస్తానని అన్నారు.. టీడీపీలో ప్లేయర్ ఒక్కరే అని మంత్రి కేశవ్ పేర్కొన్నారు. కోడికత్తి, గులకరాయి నాటకాలు చేసే నాయకుడు చంద్రబాబు కాదు అని ఎద్దేవా చేశారు. 27 క్లేమోర్మైన్ల పోలినా బేధారకుండా లేచి నిలబడి చొక్కా సర్దుకొని నడిచి వెళ్లిపోయిన నాయకుడు చంద్రబాబు.. పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమకు ఉపయోగం లేదని జగన్ అన్నారు.. రాయలసీమ ద్రోహిగా జగన్ మిగిలిపోతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిలో ఒకశాతం కూడా జగన్ చేయలేదని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.

Exit mobile version