NTV Telugu Site icon

Minister BC Janardhan Reddy: ఎంతో మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ.. ఆ పేరుతో పథకం ఆనందం..

Minister Bc Janardhan Reddy

Minister Bc Janardhan Reddy

Minister BC Janardhan Reddy: ఎంతో మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ.. ఆ పేరుతో జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి.. నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పది మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరుతో కూటమి ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిందన్నారు.. రాష్ట్రంలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించాలనే లక్ష్యంగా 475 కళాశాలలో ఈ పథకాన్ని ప్రారంభించామన్న తెలిపారు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పథకాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించి విద్యార్థులతో సహా పంక్తి భోజనం చేశారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కళాశాలలో నెలకొన్న గదుల కొరత తదితర సమస్యలను సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు.

Read Also: Allu Arjun : నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్.. మేజిస్ర్టేట్ ఎదుట పత్రాలపై సంతకం

ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి అధ్యాపకుల పట్ల గౌరవం, క్రమ శిక్షణ కల్గి ఉంటే భవిష్యత్తులో మంచి ప్రతి ఫలాలు అందుకుంటారని వెల్లడించారు.. కాలేజీల్లో నిరుపేద విద్యార్థులకు అందించే నోటికాడి భోజనాన్ని గతంలో వైసీపీ ప్రభుత్వం, నిలిపి వేసిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు, ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ 475 కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు తమ కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందించాలనే లక్ష్యంగా ఈ పథకం అమలు చేస్తోన్నట్లు తెలిపారు. డొక్కా సీతమ్మ మహా తల్లి.. ఆ నాటి రోజుల్లో పది మంది పేదలకు కడుపు నిండా భోజనం పెట్టి ఎంతోమంది ఆకలి తీర్చిందని ఆమె జ్ఞాపకం గానే ఆమె పేరుతో ప్రభుత్వ భోజన పథకం ప్రారంభించినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఆకలి అనేది మనిషిని ఎంతో ప్రభావితం చేస్తుందని.. భాద, నొప్పి, తట్టుకోవచ్చు కానీ ఆకలిని తట్టుకోలేమని పేర్కొన్నారు. కళాశాలలో నెలకొన్న గదుల కొరత సమస్యలను సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకుని రావడంతో అదనపు తరగతి గదులను నిర్మించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Show comments