Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Many Ycp Leaders Joined Tdp In The Presence Of Bc Janardhan Reddy

BC Janardhan Reddy: కాటసాని రామిరెడ్డికి భారీ షాక్.. సైకిలెక్కిన ఎర్రబోతుల వర్గీయులు..!

Published Date :February 27, 2024 , 9:09 pm
By Rajesh Veeramalla
BC Janardhan Reddy: కాటసాని రామిరెడ్డికి భారీ షాక్.. సైకిలెక్కిన ఎర్రబోతుల వర్గీయులు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు షురూ అవుతున్నాయి. తాజాగా.. కొలిమిగుండ్ల మండలంలో న్యూట్రల్‌గా ఉన్న 30 కుటుంబాలతో సహా.. 15 మంది వైసీపీ దళిత నేతలు, ఎర్రబోతుల కుటుంబానికి చెందిన కీలక నేత కూడా బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మంగళవారం కొలిమిగుండ్ల మండలంలో జరిగిన చేరికల కార్యక్రమంలో భాగంగా.. గత కొన్నేళ్లుగా స్థానిక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న గూడూరు నాగేశ్వర్ రెడ్డి, గూడూరు నాగ శేష రెడ్డి, గూలి నాగేశ్వర్ రెడ్డి, గూలి జయరామ రెడ్డి, పీరం హర్షవర్ధన్ రెడ్డి వంటి నేతలతో సహా మొత్తం 30 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే దాసరి పెద్ద దస్తగిరి, దాసరి బాలుడు,దాసరి నడిపి దస్తగిరి, దాసరి పుల్లయ్య, నారాయణ స్వామి, దాసరి హరి, దాసరి రాజేష్, దాసరి విష్ణు వర్ధన్ వంటి 15 మంది నేతలు కుటుంబాలతో సహా వైసీపీని వీడి బీసీ జనార్థన్ రెడ్డి గారి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీసీ జనార్థన్ రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చంద్రబాబును, బనగానపల్లె అభివృద్ధి కోసం బీసీ జనార్థన్ రెడ్డిని గెలిపించుకుని తీరుతామని ప్రకటించారు.

Ajay Manikrao: లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా మానిక్‌రావ్ నియామకం

అనంతరం కొలిమిగుండ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మరో చేరికల కార్యక్రమంలో ఎస్సీ కాలనీ దళిత నాయకులు టీడీపీలో చేరారు. జగన్ రెడ్డి అరాచక పాలనలో దళితులపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా, స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరుల వేధింపులకు విసుగెత్తిన బుగ్గ రాముడు, జీవయ్య, ఓబులేసు, బండ్రా వాసు, పేతురు, బాలయ్య మరో 15 మంది దళిత నేతలు కుటుంబాలతో సహా వైసీపీని వీడి బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన దళిత నేతలు మాట్లాడుతూ… వైసీపీలో దళితులకు ప్రాణాలకు రక్షణ లేదని అని అన్నారు. దళితుల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని అన్నారు. బీసీ జనార్థన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో దళితుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసారని కితాబు ఇచ్చారు. దళితుల స్థలాలు కబ్జాలు చేస్తూ తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్న వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని చిత్తుగా ఓడించి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి గారి గెలిపించుకుంటామని దళిత నేతలు ప్రకటించారు.

Odisha: బీజేడీలో రికార్డ్ బ్రేక్.. పోటీకి 10 వేల మంది అప్లై!

ఇక కొలిమిగుండ్ల మండంలోని నాయినిపల్లి గ్రామంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎర్రబోతుల వర్గానికి చెందిన కీలక నేత సైకిలెక్కేసారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి సమీప బంధువు ఎర్రబోతుల నాగిరెడ్డి తన అనుచరులతో సహా బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి, టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. బనగానపల్లెలో బీసీ జనార్థన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఈ రెండు నెలలు పట్టుదలగా పని చేద్దామని పిలుపునిచ్చారు. మొత్తంగా కొలిమిగుండ్లలో బీసీ జనార్థన్ రెడ్డికి మద్దతుగా వైసీపీ కీలక నేతలు వరుసగా సైకిలెక్కడం టీడీపీ క్యాడర్‌లో సరికొత్త జోష్ నెలకొల్పగా, ఎన్నికలకు ముందు కీలక నేతలు టీడీపీలోకి వలసలు వెళ్లడం వైసీపీ క్యాడర్‌లో నైరాశ్యాన్ని కలిగిస్తోంది. ఎన్నికల ముందు బనగానపల్లె నియోజవర్గంలో వైసీపీకి పట్టుఉన్న కొలిమిగుండ్ల మండలంలో టీడీపీలోకి వలసలు షురూ అవుతుండడంతో ఈసారి ఎన్నికల్లో బీసీ జనార్థన్ రెడ్డి గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bc janardhan reddy
  • chandrababu
  • join
  • tdp
  • telugu news

తాజావార్తలు

  • Cyber Crime Police Crack Down : సైబర్ దొంగలకు షాక్.. కోట్ల రికవరీ ఎలా సాధ్యమైంది..?

  • Tamil Nadu: “పోలీసమ్మ నీకు సెల్యూట్”.. 9 మంది తోటి సిబ్బందికే ఉరిశిక్ష పడేలా చేసిన హెడ్‌ కానిస్టేబుల్..

  • RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions