Minister BC Janardhan Reddy: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి అమ్మ వార్లకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ఇందిరమ్మ దంపతులు దర్శించుకున్నారు.. యాగంటి ఆలయ క్షేత్రానికి చేరుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి – ఇందిరమ్మ దంపతులకు ఆలయం మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు, ఆలయ సంప్రదాయబద్ధంగా తలపాగా ధరించిన మంత్రి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను భక్తిశ్రద్ధలతో తలపై ఉంచుకొని ఉమా మహేశ్వర స్వామి వారి సన్నిధికి చేరుకున్నారు.. ఏకశిలపై కొలువున్న ఉమామహేశ్వరులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు విశేష అభిషేక ప్రత్యేక పూజలను నిర్వహించారు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ఉదయం 5 గంటల నుండి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, కుంకుమార్చన, సహస్రనామావళి, వంటి విశేష పూజలను, వేద పండితుల మంత్రోచ్ఛారణాలతో ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు, నేటి అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భావ కాల ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు.
Read Also: Crime News: పండుగ పూట విషాదం.. వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని సూసైడ్!
ఇక, యాగంటిలో స్వామి అమ్మ వారిని దర్శించు కునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చిన భక్తులు క్యూలైన్ల లో నిలిచి ఉన్నారు, స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు రెండు గంటల సమయం పడుతున్నట్లు భక్తులు వెల్లడించారు. మరోవైపు.. ఉమామహేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. స్వామి అమ్మ వారి సన్నిధిలో తాను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదన్నారు.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు తామిచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా ఉమామహేశ్వరులు, అనుగ్రహించాలని కోరుకున్నట్లు వెల్లడించారు, మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.