NTV Telugu Site icon

Gas Cylinder Blast: ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. ఇద్దరు మృతి, 8 మందికి సీరియస్‌..!

Gas Cylinder Blast

Gas Cylinder Blast

Gas Cylinder Blast: నంద్యాల జిల్లాలో ఓ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.. నంద్యాల మండలం చాపిరేవులలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలు వెంకటమ్మా , ఆరేళ్ళ బాలుడు పండు మృత్యువాత పడ్డారు. రెండు ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.. ఓ ఇంట్లో సోమవారం రాత్రి సమయంలో ఇంట్లో సిలిండర్ సరిగ్గా ఆఫ్ చేయకపోవడంతో.. గ్యాస్ ఇల్లంతా వ్యాపించింది. అయితే, మంగళవారం తెల్లవారుజామున వృద్ధురాలు వెంకటమ్మ లైట్ వేయడంతో ఒక్కసారిగా సిలెండర్ పేలి, మంటలు వ్యాపించాయి. భారీగా శబ్దం చేస్తూ రెండు ఇళ్లు కూలిపోయాయి. మంటల్లో వృద్దురాలు వెంకటమ్మ , ఆరేళ్ల బాలుడు పండు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. మంటలను అదుపులోకి తెచ్చి, శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందిన బాలుడు పండును బయటికి తీశారు ఫైర్ సిబ్బంది. మరో ఇంట్లో శిథిలాల కింద ఉన్న వెంకటమ్మ బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో.. గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు..

Read Also: Puri Jagannadh: మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్న పూరి జగన్నాథ్..!