కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ను జైలుకు పంపాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. లేని స్కామ్‌లను సృష్టిస్తున్నారని ఆరోపించారు. జగన్ చుట్టూ ఉన్న వారిపై కూడా కేసులు పెడుతున్నారన్నారు. జగన్‌ను ఎందుకు స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదని ప్రశ్నించారు. జగన్ పర్యటనపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని నిలదీశారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy-Komatireddy: మళ్లీ సీఎం కావాలని పూజలు చేశా.. సీఎం, మంత్రి ఫోన్ కాల్ వైరల్!
రాష్ట్ర ప్రజల్లో ఉన్న అసహనం బయటపడుతుందని ప్రభుత్వం భయపడుతుందన్నారు. ఐవీఆర్ఎస్ సర్వే రిపోర్టును బయట పెట్టాలని డిమాండ్ చేశారు. యూరియా బస్తాల పంపిణీలో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గోస్పాడు, నంద్యాల మండలాల్లో టీడీపీ నేతలే యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నారని శిల్పా రవి తెలిపారు.
ఇది కూడా చదవండి: Saiyaara: నా సగం జీవితం అక్కడే గడిచిపోయింది.. దర్శకుడి ఎమోషనల్ పోస్ట్
