NTV Telugu Site icon

Minister Payyavula Keshav: శ్రీశైలం నుంచి నీటి వినియోగంపై తెలంగాణతో సంప్రదింపులు..

Payyavula Keshav

Payyavula Keshav

Minister Payyavula Keshav: శ్రీశైలం జలాశయ నీటి వినియోగంపై తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. నంద్యాల జిల్లా కలెక్టరేట్ లోని సెంచునరి హల్ లో డీడీఆర్‌సీ నీటి పారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. గతంలో ఒకే రాష్ట్రం వున్నప్పుడు నీటి వాడకంపై ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు.. శ్రీశైలం జలాశయాలను రెండు రాష్ట్రాలవారు ఎవరికి వారే వాడితే.. రైతులే నష్టపోతారన్నారు మంత్రి కేశవ్. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలను తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని మంత్రి నిమ్మల రామనాయుడును సంప్రదించి ప్రకటన చేశామన్నారు. కానీ, రెండో పంటగా ఆరుతడి పంటలే మంచిదన్నారు మంత్రి కేశవ్.

Read Also: Rishabh Pant Got Injured: గాయపడ్డ రిషబ్ పంత్.. మూడో టెస్టులో ఆడుతాడా?

గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు చేసిందని, వేల కోట్లతో బకాయిలు పెట్టిందని ఆరోపించారు మంత్రి పయ్యావుల.. ప్రస్తుతం తాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు జనార్దన్ రెడ్డి , ఫరూక్, ఎమ్మెల్యేలు గౌరు చరిత , అఖిల ప్రియ , బుడ్డా రాజశేఖర రెడ్డి , జయసూర్య , సూర్యప్రకాష్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాల మధ్య.. ఇప్పటికే కొన్ని సమావేశాలు జరిగాయి.. నీటి వాటాలపై కూడా చర్చలు జరిగినా.. కొలిక్కిరాని విషయం విదితమే.. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు వద్ద కూడా రెండు రాష్ట్రాల వాదనలు.. పరస్పర ఫిర్యాదులు కూడా వెళ్లాయి.. ఇక, నాగార్జున సాగర్‌ వద్ద.. పలు మార్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం విదితమే..

Show comments