NTV Telugu Site icon

Nandyal : మున్సిపల్ చైర్ పర్సన్ పై అట్రాసిటీ కేసు నమోదు..

Mabunissa

Mabunissa

శనివారం నాడు నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా పై అట్రాసిటీ కేసును త్రీ టౌన్ పోలీసులు నమోదు చేసారు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. 29 వ వార్డు సచివాలయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోల విషయంలో టీడీపీ నేతలు, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో భాగంగా తనను కులం పేరిట టీడీపీ పార్టీకి చెందిన నేత తిమ్మయ్యను చైర్ పర్సన్ మాబున్నిసా దూషించారని ఫిర్యాదు చేసారు. ఇందులో భాగంగా తిమ్మయ్య ఫిర్యాదు మేరకు చైర్పర్సన్ తో పాటు ఆమె భర్త జీలాని, మరో ఇద్దరిపై అట్రాసిటి కేసు నమోదు చేసారు.

Surya Stotram: ఆదివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంపొందుతారు..

ఈ విషయం సంబంధించి టీడీపీ, వైఎస్ఆర్సిపి కార్యకర్తల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ సమయంలో ఇరుపార్టీ నాయకులు దుర్భాషలకు దిగారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరు పార్టీల వారికి సర్ది చెప్పి చివరికి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వార్డు సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఉంచే నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది.

Indian 2 : ఇండియన్ 2 సెన్సార్ పూర్తి? రన్ టైం ఎంతంటే..?