Shilpa vs Bhuma: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తాజాగా సవాల్ విసిరిన విషయం విదితమే.. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలన్న ఆమె.. ఆధారాలతో చర్చకు రావాలని చాలెంజ్ చేశారు.. లేనిపక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇక, శిల్పా రవి టీడీపీ వైపు చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు భూమా అఖిల ప్రియ.. అయితే, భూమా అఖిల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.. నా బాస్ జగన్.. జీవితమంతా జగన్ వెంటనే.. జగన్ ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి వివాదాన్ని అవకాశంగా తీసుకుని నాపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.. భూమా అఖిల ఆరోపణలు బాబు మార్క్ ట్రిక్స్ గా పేర్కొన్న ఆయన.. వైసీపీలో కలకలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
Read Also: Free Cancer Screening: మల్లారెడ్డి క్యాన్సర్ హస్పిటల్‌లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్..
నేను టీడీపీలో చేరాలని అనుకోవడం ఏమిటి..? ఇది సీఎం వైఎస్ జగన్‌ను నారా లోకేష్.. ఎమ్మెల్సీ లేదా ఏదైనా చైర్మన్ పోస్ట్ అడిగినట్లు ఉందంటూ కామెంట్ చేశారు శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి.. నాపై పోటీ చేసే వారు ఎవరనే విషయంపై టిడిపి వారికే క్లారిటీ లేదన్న ఆయన.. అయినా.. ఆడపిల్లలపై కాలు దువ్వే స్థాయికి నేను దిగజారలేదన్నారు.. నన్ను ప్రశ్నించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవడం మంచిదని హితవుపలికారు.. అప్పు చెల్లించమని బ్యాంకర్లు, బంధువులు ఇళ్ళ ముందు ధర్నాలు చేసిన సంఘటనలు, హైదరాబాదులోని బోయిన్ పల్లి నాటకాన్ని మరిచారా? అంటూ ఘాటుగా స్పందించారు.. శిల్పా ఫ్యామిలీ ఇమేజ్, ప్రజాబలం అందరికీ తెలుసు, అందుకే 35 వేల మెజార్టీతో గెలిచామని గుర్తుచేశారు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి.