ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబుతోన్నాయి.. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఏపీలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి.. ఇక, విస్తీర్ణంలో దేశంలోనే ఏడో అతి పెద్ద జిల్లాగా రికార్డుకెక్కిన అనంతపురం ఇక మీదట రెండు జిల్లాలు కానుంది.. అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధామం పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు కాబోతోంది.. అనంతపురం జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, సత్యసాయి జిల్లా పరిధిలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. సత్యసాయి జిల్లాలోకి పుట్టపర్తి, కదిరి, హిందూపురం, మడకశిర, పెనుకొండ, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తున్నాయి.. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందించారు టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ.
Read Also: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు శుభవార్త.. !
పరిపాలన వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన నందమూరి బాలకృష్ణ.. హామీ ఇచ్చిన విధంగా.. ప్రతీ పార్లమెంట్ కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని కోరారు.. అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది.. వ్యాపారపరంగా, వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా.. అన్ని రకాలుగా ఎంతో అభివృద్ధి చెందిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు.. హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు బాలయ్య.. హిందూపురం పట్టణ పరిసరాల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, భవిష్యత్ అవసరమైన భూమి పుష్కలంగా ఉందని.. కానీ, జిల్లాల ఏర్పాటులో రాజకీయం చేయొద్దని కోరారు.. హిందూపురం పట్టణ ప్రజల మనోభావాలను గౌరవించి.. వారి చిరికాల కోరికైన హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు నందమూరి బాలకృష్ణ.