NTV Telugu Site icon

Nandamuri Balakrishna: మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి మృతికి బాలయ్య సంతాపం

Balakrishna Dayakar

Balakrishna Dayakar

Nandamuri Balakrishna Condolences Death Of Dayakar Reddy: టీడీపీ సీనియర్ నేతల, మక్తల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. దయాకర్ రెడ్డి కుటుంబంతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని, వారు తనకు మంచి మిత్రులని తెలిపారు. ఆత్మీయుని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దయాకర్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రముఖులు సంతాపం తెలిపారు.

Janasena Party Office: జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖుల సందడి

కాగా.. కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దయాకర్ రెడ్డి, ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈయన 1994, 1999లో టీడీపీ నుంచి అమరచింత నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందారు. 2009లో మక్తల్ నుంచి పోటీ చేసి గెలిచారు. దయాకర్ రెడ్డి భార్య సీత కూడా 2009లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరిద్దరికీ టీడీపీతో మంచి అనుబంధం ఉంది. విభజన తర్వాత కూడా దయాకర్ రెడ్డి పార్టీలో కొనసాగారు. అయితే.. గతేడాది ఆగస్టులో దయాకర్ రెడ్డి దంపతులు టీడీపీకి రాజీనామా చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని వీడాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి వాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

Shocking incident: సెల్ఫీ కోసం తీసుకెళ్లి.. భర్తను చెట్టుకు కట్టేసి నిప్పుపెట్టిన భార్య

Show comments