Site icon NTV Telugu

Nadendla Manohar: పేదల ఇళ్లపై జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే..!!

Nadendla Manohar

Nadendla Manohar

Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంపై జనసేన నేత, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి విమర్శలు చేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. మూడున్నరేళ్లలో నిర్మించిన ఇళ్లు కేవలం 8 శాతమేనని.. పీఎంఏవై ఇళ్లు కేవలం 5 శాతం మాత్రమే నిర్మించారని నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం ఇచ్చిన నిధుల నుంచి రూ.1,547 కోట్లు పక్కకు మళ్లించారన్నారు. సమీక్షల్లో వాస్తవాలను తొక్కిపెడుతున్నారని.. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ని లోపాలతో నవరత్నాల్లో ఇచ్చిన హామీల్లోనూ అన్నీ నెరవేర్చేశామని గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు.

Read Also: R Krishnnaiah: జగన్ ఓ సంఘ సంస్కర్త.. కులాల ఆత్మగౌరవాన్ని గుర్తించారు

వైసీపీ ప్రభుత్వం పేదలను ఇళ్ల నిర్మాణం విషయంలో పెద్ద మోసం చేస్తోందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు అని చెప్పే సీఎం జగన్ ఈ మూడున్నరేళ్ల కాలంలో ఎన్ని ఇళ్లను నిర్మించి పేదలకిచ్చారో చెప్పాలన్నారు. తన పార్టీ మ్యానిఫెస్టో తనకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని చెప్పుకొనే జగన్ దమ్ముంటే నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పేదలకు 31 లక్షల మందికి 2023 నాటికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారని.. పేదల ఇళ్లకు ఇసుక కూడా ఇవ్వడం లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ‘పేదలందరికీ ఇళ్లు’ అనే పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 18,63,562 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మూడున్నరేళ్లలో కేవలం 1,52,325 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారన్నారు. దాదాపు 80 శాతం ఇళ్లు పునాదులకే పరిమితమయ్యాయని విమర్శలు చేశారు.

Exit mobile version